
మధుమేహాన్ని సరైన ఆహారం, వ్యాయామంతో పూర్తిగా నియంత్రించుకోవచ్చు. వయసు పెరుగుతుండగా, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే, డయాబెటిక్‌లో ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే.. అంత మంచిది అంటున్నారు నిపుణులు.

గుడ్డు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, పోషకాలతో నిండి ఉన్న మంచి పోషకాహారంగా నిపుణులు చెబుతున్నారు. శరీరాకృతిని కాపాడుకోవాలనుకునే వారు రోజూ ఒక గుడ్డు తినడం అలవాటు చేసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిక్‌లో గుడ్డు సరైన ఆహారమే. అయితే, మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే అది సరైన ఫలితం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ బాధితులు వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు 39 శాతం పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా చైనాలోని ప్రజలు దీని బారిన పడుతున్నారు.

ఇకపోతే, మధుమేహం ఉన్నవారు కోడి గుడ్ల విషయానికి వస్తే.. వీటిలో బయోటిన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇక గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపదు. దీనివల్ల షుగర్ ఉన్నవారు కూడా మితంగా గుడ్లు తినవచ్చు అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డు వల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యాయి. గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదే. ఏడాదిపాటు వారానికి 12 గుడ్ల చొప్పున తినే డయాబెటిస్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట.