1 / 6
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధి లక్షలాదిమందిని పట్టిపీడిస్తోంది.. అయితే.. డయాబెటిక్ పేషెంట్లలో, ఆహారం కొంచెం ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పటికీ చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ముందుగా ఏం తినాలి..? ఎంత తినాలి అనేది తరచూ ఆలోచించాల్సి ఉంటుంది.. ప్రత్యేకంగా ఆహారం శ్రద్ధచూపుతేనే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.. శాశ్వతంగా నయం చేయలేని మధుమేహాన్ని వైద్యుల సూచన మేరకు మందులు వాడడం, శారీరక శ్రమ, కొన్ని కూరగాయలు తినడం ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు.. అయితే.. అలాంటి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక వరం లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.. ఉల్లిపాయను తీసుకోవడం ద్వారా షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చని పేర్కొంటున్నారు.