Rugged SUV’s: రోడ్డు ఎలా ఉన్నా ఈ కార్లతో ప్రయాణం సులభం.. యువతను ఆకట్టుకుంటున్న సూపర్ ఎస్‌యూవీలు ఏంటంటే..?

|

Jun 29, 2024 | 4:45 PM

ఇటీవల కాలంలో కారు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎగువ మధ్య తరగతి, సంపన్నుల ఇళ్లల్లో కార్లు కచ్చితంగా ఉంటున్నాయి. అయితే కార్లు సాధారణంగా ప్రయాణానికి వినియోగిస్తూ ఉంటారు. అయితే రోడ్డు సరిగ్గా లేకపోయినా, కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ అన్నా ఈ కార్ల ప్రయాణం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలు ఆఫ్‌రోడింగ్ కాన్సెప్ట్‌తో సరికొత్త ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ఈ కార్లు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్-5 ఆఫ్‌రోడింగ్ కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
రూ.11.39 లక్షల ధరతో బొలెరో నియో ప్లస్ మహీంద్రా & మహీంద్రా ఆఫ్‌రోడింగ్ ఎస్‌యూవీగా ఉంది. తొమ్మిది మంది వ్యక్తుల సామర్థ్యంతో నియో+ క్యాబిన్ లోపల 2-3-4 సీటింగ్ లేఅవుట్‌తో వస్తుంది. ఇది 118 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 280 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసేలా 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్‌తో అమర్చబడింది. బొలెరో నియో+ రెండు వేర్వేరు ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంటుంది.

2 / 5
రూ.12.74 నుంచి రూ.14.95 లక్షల ధరతో మారుతి సుజుకి జిమ్నీ ఐదు-డోర్ల కాంపాక్ట్ ఆఫ్-రోడర్ యువతను ఇటీవల కాలంలో అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ కారు 102 బీహెచ్‌పీ, 136 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా నాలుగు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో వస్తుంది. జిమ్నీ ఐదు సీటర్‌‌గా వచ్చినప్పటికీ నలుగురికి సరిపోయేంత సౌకర్యంగా ఉంటుంది. ఈ కారులో డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా మూడు వేర్వేరు సెట్టింగ్లలో అమలు చేసే సుజుకి ఆల్ప్ 4డబ్ల్యూడీ సిస్టమ్ ఆకట్టుకుంటుంది.

3 / 5
మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రీమియం ఎస్‌యూవీ ఆఫ్‌రోడింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఎలాంటి రోడ్లపైనైనా సౌకర్యవంతంగా ప్రయాణించే ఈ ఎస్‌యూవీ ధర రూ.13.85 నుంచి రూ.24.54 లక్షలు ఉంటుంది. 200 బీహెచ్‌పీ, 370 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 2.0 లీటర్ ఎం-స్టెలియాన్ టర్బో - పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కారు 2.0 లీటర్ ఎం-హాక్ డీజిల్ మోటారుతో వస్తుంది. ఈ కారు రెండు విభిన్న ట్యూన్లలో ఉంటుంది. జెడ్2 వెర్షన్ 130 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది, జెడ్ 4 వెర్షన్ 172 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 4x2 లేదా 4x4 వేరియంట్లో వస్తుంది.

4 / 5
రూ.16.75 నుంచి రూ.18.00 లక్షల లోపు ధరతో ఫోర్స్ గూర్ఖా భారతీయ ఆఫ్-రోడింగ్‌కు అనువుగా ఉంటుంది. ఇది త్రీ-డోర్, ఫైవ్-డోర్ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. త్రీ డోర్ అయితే నాలుగు-సీటర్, ఫైవ్ డోర్ అయితే సెవెన్- సీటర్‌తో వస్తుంది. ఫోర్స్ గూర్ఖా 2.6 లీటర్ ఫోర్ సిలిండర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఇంజిన్ 132 బీహెచ్‌పీ, 320 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ ఆరు- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ కారు ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది.

5 / 5
మహీంద్రా కంపెనీ రిలీజ్ థార్ 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఆఫ్ రోడర్ ఎస్‌యూవీ యువతను అమితంగా ఆకర్షిస్తుంది. థార్ మూడు వేరియంట్లలో రెండు వేర్వేరు ఇంజిన్లతో అందుబాటులో ఉంది. 117 బీహెచ్‌పీ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ డీజిల్, 150 బీహెచ్‌పీ ఉత్పత్తి చేసే 2.0 లీటర్ ఇన్లైన్-ఫోర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 4x4 థార్ 150 బీహెచ్‌పీ ఉత్పత్తి చేసే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ లేదా 130 బీహెచ్‌పీ ఉత్పత్తి చేసే 2.2 లీటర్ డీజిల్ యూనిట్‌తో వస్తుంది.