Top Load vs Front Load Washing Machine: టాప్ లోడ్ vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్.. మీ ఇంటికి ఏది బెస్ట్?

Updated on: Jan 11, 2026 | 1:45 PM

Top Load vs Front Load Washing Machine: టాప్ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌- ఫ్రంట్‌లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌. ఇందులో ఏది మంచిదో మీకు తెలుసా? వాషింగ్‌ మెషీన్‌ను కొనుగోలు చేసే ముందు మీ ఇంటికి ఏది ఉత్తమమో తెలుసుకోవడం మంచిది. మరి రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం..

1 / 5
 Top Load vs Front Load Washing Machine: ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు బట్టలను నిలువుగా తిప్పే సాంకేతికతతో పనిచేస్తాయి. మొండి మరకలను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది టాప్ లోడ్ కంటే తక్కువ నీరు, తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తుంది. ఫలితంగా విద్యుత్ బిల్లు తగ్గుతుంది. ఇది బట్టలు నెమ్మదిగా ఉతుకుతుంది. బట్టలు అంత త్వరగా దెబ్బతినవు. పనిచేసేటప్పుడు శబ్దం తక్కువగా ఉంటుంది.

2 / 5
 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు కొంచెం ఖరీదైనవి. కొన్ని ఇటీవలి మోడల్స్ తప్ప, మీరు మధ్యలో బట్టలు పెట్టలేరు. లోపల తేమ కారణంగా బూజు పెరిగే అవకాశం ఉంది. అందుకే మీరు ఉపయోగించిన తర్వాత తలుపును కాసేపు తెరిచి ఉంచాలి.

3 / 5
 మన దేశంలో చాలా మంది టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను ఇష్టపడతారు. ఇందులో బట్టల పైనుండి పెట్టాలి. ఫ్రంట్ లోడ్ మెషీన్లతో పోలిస్తే ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. వాషింగ్ ప్రక్రియ మధ్యలో కూడా మీరు మరిన్ని బట్టలు జోడించవచ్చు. ఈ మెషీన్‌లో నీరు త్వరగా ఆవిరైపోతుంది. అందుకే బూజు సమస్య తక్కువగా ఉంటుంది.

4 / 5
 టాప్ లోడ్ బట్టలు కొంచెం గట్టిగా ఉతుకుతుంది. నీరు, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఉతికిన తర్వాత బట్టలు తడిగా ఉంటాయి. అందుకే ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది.

5 / 5
ఏది ఎంచుకోవాలి: మీరు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటే, నీటిని ఆదా చేయాలనుకుంటే, శబ్దాన్ని తగ్గించాలనుకుంటే ఫ్రంట్‌ లోడ్‌ వాషింగ్‌ మెషీన్‌ ఉత్తమం. మీ బడ్జెట్ పరిమితంగా ఉంటే టాప్ లోడ్‌ సరైన ఎంపిక చేసుకోండి. యంత్రం ఏదైనా, దాని జీవితకాలం దానిని ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్ ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోండి.