- Telugu News Photo Gallery Business photos This Biscuits Business With Low Investment Get You Monthly Rs 25000 Income
Business Ideas: ఇంటి నుంచే పని.. ఈ వ్యాపారంతో నెలనెలా రూ. 25 వేలు మీ సొంతం!
రోజూ 9 టూ 5 జాబ్ చేసి.. చేసి.. విసిగిపోతున్నారా.? తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చూస్తున్నారా.? అయితే డోంట్ వర్రీ.! మీకోసం ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేశాం. ఈ వ్యాపారం ద్వారా మంచి లాభాలు సంపాదించవచ్చు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
Updated on: Dec 06, 2023 | 4:15 PM

రోజూ 9 టూ 5 జాబ్ చేసి.. చేసి.. విసిగిపోతున్నారా.? తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని చూస్తున్నారా.? అయితే డోంట్ వర్రీ.! మీకోసం ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేశాం.

ఈ వ్యాపారం ద్వారా మంచి లాభాలు సంపాదించవచ్చు. అదే బిస్కెట్ల వ్యాపారం. ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరు చెందిన మహమ్మద్ అలీ అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా ఈ బిస్కెట్ల వ్యాపారం చేస్తూ లాభాలు గడిస్తున్నాడు.

బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఈ బిస్కెట్లను కొనుగోలు చేసి.. అతడు స్థానికంగా అమ్మకాలు చేస్తూ వచ్చాడు. రూ. 50 వేల ఖర్చుతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టిన అతడు.. నెలనెలా వివిధ రకాల బిస్కెట్లను అమ్ముతూ వచ్చాడు.

ఇక అవన్నీ కూడా మంచిగా అమ్మకాలు జరిగితే.. సామాగ్రి ఖర్చు పోనూ నెలకు రూ. 25 వేల వరకు ఆదాయం వస్తుందని మహ్మమద్ అలీ తెలిపాడు. చిన్న చిన్న బిస్కెట్ల నుంచి గుండ్రాటి బిస్కెట్లు, స్క్వేర్ షేప్ బిస్కెట్లు, లవ్ సింబల్స్ లాంటి బిస్కెట్లను మహ్మమద్ అలీ ప్రజలకు అందుబాటులో ఉంచాడు.

ఈ బిస్కెట్లు టీలో అద్దుకుని తినడమే కాదు.. మార్నింగ్ అండ్ ఈవెనింగ్ స్నాక్స్‌గానూ తీసుకోవచ్చునని చెబుతున్నాడు.





























