EPFO New Rules: ఈపీఎఫ్‌వోలో భారీ మార్పులు.. ఉద్యోగులకు కొత్త రూల్స్.. వాటిని తప్పనిసరి చేస్తూ నిర్ణయం

Updated on: Jan 11, 2026 | 5:46 PM

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్‌వో రికార్డులో పేరు, లింగ వివరాలు మార్చుకునేందుకు 18 పత్రాలను ఆమోదించింది. ట్రాన్స్‌జెండ్ సర్టిఫికేట్‌ను కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్క్యూలర్ ఇచ్చింది. ఏయే పత్రాలు ఈపీఎఫ్‌వో ఆమోదించిందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఈపీఎఫ్‌ రికార్డుల్లో వ్యక్తిగత వివరాలను మార్చుకోవడం ఒకప్పుడు కష్టతరమైన పని. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియను ఈపీఎఫ్‌వో ఆర్గనైజేషన్ సులభతరం చేసింది. ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, లింగ వివరాలు తప్పు పడితే మార్చుకోవడం చాలా సులువు. ఈ మేరకు ఎలా అప్డేట్ చేసుకోవాలనే దానిపై ఈపీఎఫ్‌వో తాజాగా ఓ సర్క్యూలర్ జారీ చేసింది.

2 / 5
లింగ, పేరు వివరాలను మార్చుకునేందుకు అవసరమైన 18 పత్రాల జాబితాను విడుదల చేసింది. పాస్ పోర్ట్, మరణ ధృవీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర, బ్యాంకులు జారీ చేసే సర్వీస్ ఫొటో గుర్తింపు కార్డ్, గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీలు జారీ చేసే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్‌లలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు.

3 / 5
ఇక యూనివర్సిటీ, బోర్డు జారీ చేసే బదిలీ సర్టిఫికేట్, ఎస్‌ఎస్‌సీ సర్టిఫికేట్ లేదా మార్క్ సీట్ వంటి వాటిని కూడా ఈపీఎఫ్‌వో ఆమోదించింది. అలాగే బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు, ఈ-పాన్, రేషన్ కార్డ్, పీడీఎస్ ఫొటో కార్డ్, ఓటర్ ఐటీ, ఈ ఓటర్ ఐడీ,పెన్షనర్ ఫొటో కార్డులను ఆమోదించారు.

4 / 5
ఇక సీజీహెచ్‌ఎస్, ఈసీహెచ్‌ఎస్‌కు సంబంధించిన మెడీక్లెయిమ కార్డ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పీఎస్‌యూ జారీ చేసే ఆర్‌ఎస్‌బీవై కార్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. ఇక పూర్తి పేరు లేదా మొదటి పేరు మార్చుకోవడానికి కొత్త పేరును సూచించే గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు పాత పేరును చూపించే సహాయక పత్రం తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.

5 / 5
అలాగే పాస్ పోర్ట్,వీసాతో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు కార్డు వంటివి కూడా ఆమోదించిన జాబితాలో ఈపీఎఫ్‌వో పొందుపరుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ట్రాన్స్‌జెండర్ ఐడెంటిటీ సర్టిఫికేట్‌కు కూడా ఇందులో స్థానం కల్పించింది. అన్నీ ఈపీఎఫ్‌వో కార్యాలయాల్లో వీటిని అమలు చేయాల్సిందే ఆదేశాలు జారీ చేసింది.