
అథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9, 3.7 కేడబ్ల్యూహెచ్ అనే రెండు రకాల బ్యాటరీ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ఒకే చార్జ్ పై 123, 160 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. దీనిలో 56 లీటర్ల అపారమైన లగేజ్ స్థలం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇందులో 35 లీటర్ల అండర్ సీట్ స్లోరేజ్, 22 లీటర్ల ఫ్రంట్ గ్లోవ్ కంపార్టుమెంట్ ఉన్నాయి. గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ రూ.1.10 లక్షల ధరలో అందుబాటులో ఉంది.

బజాజ్ కంపెనీ నుంచి 35 సిరీస్ అనే కొత్త తరం చేతక్ స్కూటర్ విడుదలైంది. దీనిలో 3501, 3502 అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.1.20 లక్షల నుంచి రూ.1.27 లక్షలు పలుకుతున్నాయి. దీనిలో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఫుల్ చార్జింగ్ తో 153 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లు.

హీరో మోటోకార్ప్ నుంచి విడుదలైన హీరో విడా వీ2 స్కూటర్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో లైట్, ప్లస్, ప్రో అనే మూడు రకాల వేరియంట్లు ఉన్నాయి. వీటిలో 2.2, 3.44, 3.94 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లను ఏర్పాటు చేశారు. బ్యాటరీలను ఇంట్లోనే చార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం ఆరు గంటల్లోనే దాదాపు 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.96 వేలు.

ప్రముఖ కంపెనీ హోండా నుంచి యాక్టివా ఇ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. దీనిలో 1.5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన రెండు మార్పిడి (స్వాపబుల్) చేయగల బ్యాటరీలను అమర్చారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 102 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అలాగే హోండా ఇ.స్వాప్ అనే బ్యాటరీ షేరింగ్ సేవను కూడా ప్రారంభించనుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 5.1 స్కూటర్ లో 5.1 కేడబ్లూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జింగ్ తో సుమారు 150 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. గంటకు గరిష్టంగా 82 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయవచ్చు. టీఎఫ్టీ టచ్ స్క్రీన్, 118కి కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, అలెక్సా ద్వారా వాయిస్ అసిస్ట్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1.85 లక్షల (ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంది.