- Telugu News Photo Gallery Business photos Marutisuzuki truevalue maruti suzuki swift dzire and celerio selling cheaper than truevalue in website
Marutisuzuki Truevalue: కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? కేవలం లక్షన్నరకే.. ఎక్కడంటే..!
Marutisuzuki Truevalue: ప్రస్తుతమున్న కరోనా కాలంలో కొత్త కారు కొనుగోలు చేయాలంటే కొంత ఇబ్బందికరమైన విషయమే. చాలా మంది సెకండ్‌హ్యాండ్ కార్ల వైపు మొగ్గు ..
Updated on: Jul 26, 2021 | 7:45 AM

Marutisuzuki Truevalue: ప్రస్తుతమున్న కరోనా కాలంలో కొత్త కారు కొనుగోలు చేయాలంటే కొంత ఇబ్బందికరమైన విషయమే. చాలా మంది సెకండ్‌హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరల్లో కూడా మంచి కార్లు లభించేవి కూడా ఉంటాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కారు కొనేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఎక్కువ బడ్జెట్ కారణంగా చాలా మంది ప్రజలు తమ కలను నెరవేర్చుకోలేకపోతున్నారు.

అయితే దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సంస్థ కొత్త కార్లను విక్రయించడమే కాకుండా, ఉపయోగించిన కార్ల సంస్థ marutisuzuki truevalue ద్వారా పాత కార్లను విక్రయిస్తుంది. ప్రస్తుతం, SWIFT, Dzire వంటి కార్లు కంపెనీ truevalue వెబ్‌సైట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ బైక్ కంటే తక్కువ ధరకే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Maruti Celerio: కంపెనీ స్టైలిస్ హ్యాచ్‌బ్యాక్ కారు Celerio యొక్క పెట్రోల్ వెర్షన్ యొక్క రెండో విఎక్స్ఐ మోడల్ ఈ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ట్రూవాల్యూ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ కారు 2014 మోడల్. ఇప్పటివరకు 47,531 కిలోమీటర్ల వేగంతో నడిచింది. దీని ధర కేవలం 3.05 లక్షల రూపాయలుగా నిర్ణయించబడింది. దీనితో పాటు, సంస్థ 3 ఉచిత సర్వీసింగ్ మరియు 6 నెలల వారంటీని కూడా అందిస్తోంది.

Maruti Swift: కంపెనీ అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన Maruti Swift పెట్రోల్ వెర్షన్ యొక్క టాప్ మోడల్ అయిన ZXI కూడా ఈ వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కారు 2010 మోడల్, ఇప్పటివరకు ఈ కారు 70,164 కిలోమీటర్లు నడిచింది. ఈ జాబితాలో చౌకైన కారు అనే చెప్పాలి. ఈ కారు ధర రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కన్నా తక్కువ. దీని ధర కేవలం రూ .1.43 లక్షలుగా నిర్ణయించబడింది. ఇవేకాకుండా ఈ వెబ్‌సైట్‌లో చాలా కార్లు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి.




