
జూన్ నెల వచ్చేస్తోంది. ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉంది. అయితే కొత్త నెల రావడంతో పాటు కొత్త రూల్స్ కూడా రానున్నాయి. ఈ నిబంధనలు చాలా మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో చాలా మందిపై పలు రకాల ప్రభావం చూపే అవకాశం ఉంది.

కెనరా బ్యాంక్ కస్టమర్లకు సంబంధించి కూడా నిబంధనలు మారనున్నాయి. సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు జూన్ 30 తర్వాత పని చేయవు. అంటే జూలై 1 నుంచి కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు నిబంధనలు కూడా మారనున్నాయి. ఈ నిబంధనలు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. చెక్ పేమెంట్స్‌కు సంబంధించి నిబంధనలు మారబోతున్నాయి. రీకన్ఫర్మేషన్ అందించాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్ మీ చెక్‌ను క్లియర్ చేయదు.

ఇక గ్యాస్ సిలిండర్ వాడే వారు కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. కేంద్రం ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటుంది. ఈసారి కూడా జూన్ 1 నుంచి సిలిండర్ ధరలు మారొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగే అవకాశం ఉంది.