
బంగారం ధరల పెరుగదలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ వస్తుండగా.. శుక్రవారం ఒక్కసారిగా ఢమాల్ అంటూ కుప్పకూలాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు. పసిడి ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. యుద్దాలు, రాజకీయ అనిశ్చితి, ఆర్ధిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటివి వీటి ధరలపై ప్రభావితం చూపిస్తాయి. శుక్రవారం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,44,330 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1850 మేర డౌన్ అయ్యాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,32,300 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.1700 మేర డౌన్ అయ్యాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,44,330 వద్ద ట్రేడవుతోండగా.. శుక్రవారం ఒక్కరోజే రూ.2950 పతనమయ్యాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,32,300 వద్ద కొనసాగుతుండగా.. నేడు రూ.2700 క్రాష్ అయ్యాయి. బెంగళూరులో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,44,330 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,300గా ఉన్నాయి

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,480 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,450గా ఉన్నాయి. అటు వెండి ధరలు కూడా భారీగా కుప్పకూలాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.5 వేలు తగ్గింది. నిన్న రూ.2.40 లక్షలుగా ఉండగా.. శుక్రవారం రూ.2.35 లక్షలకు చేరుకుంది.

హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2.40 లక్షల వద్ద ఉండగా. గురువారం రూ.2.45 లక్షలుగా ఉంది. నేడు రూ.5 వేలు తగ్గముఖం పట్టింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోండగా.. బెంగళూరులో రూ.2.35 లక్షల వద్ద ట్రేడవుతోంది.