AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic Currency: భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై మరో బిగ్ అప్డేట్.. ఆర్బీఐ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) త్వరలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు టెండర్లకు దరఖాస్తులు ఆహ్వనించగా.. ఇప్పటికే మూడు కంపెనీలు ముందుకొచ్చాయి. అంతర్జాతీయ కంపెనీలు ముందుకు రాగా.. టెండర్లలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. వచ్చే ఏడాదిలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసకొచ్చే అవకాశముంది.

Venkatrao Lella
|

Updated on: Sep 03, 2026 | 8:11 AM

Share
భారత్‌లో త్వరలో కొత్త కరెన్సీ నోట్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్ల స్థానంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురానున్నారు. వచ్చే ఏడాదిలో పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ కరెన్సీ నోట్ల తయారీకి సంబంధించి పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆర్బీఐ ఆహ్వానించింది. అయితే టెండర్లలో కఠిన నిబంధనలు విధించింది.

1 / 5
బిడ్డింగ్‌లో జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ఆర్బీఐ కొన్ని షరతులు విధించింది. టెండర్లలో పాకిస్తాన్, చైనాతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విక్రేత, సరఫరాదారులను నిషేధించింది. ఈ మేరకు బిడ్డింగ్ కంపెనీలతో పలు ఒప్పందాలపై ఆర్బీఐ సంతకాలు చేయించుకుంది. యూకే, ఆస్త్రేలియా, వియత్నాంకు చెందిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి.
 నిబంధనల కారణంగా చైనా, పాకిస్తాన్‌కు చెందిన కంపెనీలు పాల్గొనలేదు.

బిడ్డింగ్‌లో జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ఆర్బీఐ కొన్ని షరతులు విధించింది. టెండర్లలో పాకిస్తాన్, చైనాతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విక్రేత, సరఫరాదారులను నిషేధించింది. ఈ మేరకు బిడ్డింగ్ కంపెనీలతో పలు ఒప్పందాలపై ఆర్బీఐ సంతకాలు చేయించుకుంది. యూకే, ఆస్త్రేలియా, వియత్నాంకు చెందిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. నిబంధనల కారణంగా చైనా, పాకిస్తాన్‌కు చెందిన కంపెనీలు పాల్గొనలేదు.

2 / 5
రిజర్వ్ బ్యాంక్‌కు చెందిన రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్ గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ పేరుతో టెండర్లను ఆహ్వానించింది. ఆగస్టు 18తో టెండర్ల ప్రక్రియ ముగియగా.. యూకే నోట్ల తయారీ సంస్థ డీలా రూతో పాటు మరో రెండు విదేశీ కంపెనీలతో ఆర్బీఐ డీల్ కుదుర్చుకుంది. అలాగే పాలిమర్ సబ్‌స్ట్రేట్‌లో జంతువుల కొవ్వు లేదా డీఎన్ఏ లేదని ధృవీకరించాల్సి ఉంటుంది. యూకేతో పాటు పలు దేశాల్లో జంతువుల కొవ్వు వాడుతుండటంతో వివాదాలు చెలరేగాయి.

3 / 5
అత్యవసరంగా సరఫరా చేయాలని ఆర్బీఐ బిడ్డింగ్ విడుదల చేసింది. సుమారు 68 వేల రీముల పాలిమర్ షీట్లు అవసరం అవుతాయని ఆర్బీఐ అంచనా వేసింది.  ప్రతీ రీమ్‌లో 500 పాలిమర్ ఫిల్మ్ సీట్లు ఉంటాయి. బిడ్లతో పాటు నమూనాలను కూడా కంపెనీలు సమర్పించాలి. వివిధ వాతావరణ పరిస్థితుల్లో నమూనాలను పరీక్షిస్తారు. అనంతరం అర్హత సాధించినవారికి తుది టెండర్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేస్తారు.

4 / 5
యూకేకు చెందిన డీ లా రూ, ఆస్ట్రేలియాకు చెందిన సీసీఎల్ సెక్యూర్, వియత్నాంకు సంబంధించిన మరో కంపెనీ పాలిమర్ షీట్లను సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ కంపెనీలతో ఆర్బీఐ ఒప్పందం కుదర్చుకుంది. పరీక్షల తర్వాత తుది కంపెనీని ఎంపిక చేయనుందని తెలుస్తోంది. తొలుత రూ.10, రూ.20 నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది.

5 / 5
Follow Us
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.

ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని

పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్

పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో

ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్

మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే

బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..

బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే

జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..

మేము ఓట్లు వేస్తాం.. అన్న నువ్వు హౌస్‌లో దైర్యంగా ఉండు!