AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹10 లక్షల అప్పును 24 నెలల్లో ఎలా తీర్చాలి ?? మధ్యతరగతి కుటుంబాల కోసం పక్క ప్రణాళిక

చాలామంది సంపాదిస్తున్నప్పటికీ చేతిలో డబ్బు నిలవకపోవడానికి ప్రధాన కారణం సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడమే. ప్రతి చిన్న అవసరానికి పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు, ఈఎంఐల వైపు చూడటం వల్ల అవి నిశ్శబ్దంగా పెరిగి కొండంత అప్పుగా మారుతాయి. నెలకు ₹45 వేల ఆదాయం ఉండి ఏకంగా ₹10 లక్షల అప్పుల భారంతో రికవరీ కాల్స్ ఎదుర్కొన్న ఒక సామాన్య కుటుంబం కేవలం 24 నెలల్లో రూపాయి బాకీ లేకుండా అప్పుల నుండి ఎలా విముక్తి పొందిందో తెలిపే నిజ జీవిత పాఠాలు ఇక్కడ చూద్దాం.

Phani CH
|

Updated on: Sep 01, 2026 | 7:37 PM

Share
అప్పుల చిట్టా – లెక్కలు రాయడం: అప్పుల విముక్తికి మొదటి అడుగు వాస్తవాన్ని అంగీకరించడం. ఎవరి దగ్గర ఎంత అప్పు ఉంది, వడ్డీ రేటు ఎంత, నెలవారీ ఈఎంఐ ఎంత అనే పూర్తి వివరాలను ఒక డైరీలో స్పష్టంగా రాసుకోవాలి. కేవలం క్రెడిట్ కార్డు 'మినిమమ్ డ్యూ' చెల్లించడం వల్ల అప్పు తగ్గదు, అది వడ్డీ ఉచ్చు మాత్రమేనని గ్రహించాలి.

1 / 5
కఠినమైన 4 సూత్రాలు: మొదటిది కొత్త అప్పులు అస్సలు చేయకూడదు. రెండోవది EMI ఆధారిత కొత్త వస్తువుల కొనుగోళ్లు పూర్తిగా బంద్ చేయాలి. మూడోవది ప్రతి పైసా ఖర్చును డైరీలో నమోదు చేయాలి. నాలుగోవది మిగిలిన ప్రతి అదనపు రూపాయిని ఒకే నిర్దిష్ట అప్పు తీర్చడానికి కేటాయించాలి.

2 / 5
తెలియకుండా అయ్యే ఖర్చులు ఆపడం: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, అనవసర షాపింగ్, బయట టీ-స్నాక్స్ వంటి చిన్న ఖర్చుల వల్ల నెలకు ₹8,000 వరకు వృథా అవుతున్నట్లు గుర్తించి వాటిని తగ్గించారు. పిల్లల చదువు, వైద్యం, మంచి ఆహారం వంటి ప్రాథమిక అవసరాలకు ఆటంకం కలగకుండానే నెలవారీ ఖర్చును ₹28,000 నుండి ₹22,000కు తగ్గించారు.

3 / 5
అదనపు ఆదాయ మార్గాలు: ఖర్చులు తగ్గించడమే కాకుండా భార్య టైలరింగ్ వర్క్ ద్వారా, భర్త వీకెండ్ పార్ట్ టైమ్ వర్క్ ద్వారా ఆదాయాన్ని నెలకు ₹45,000 నుండి ₹62,000కు పెంచుకున్నారు. ఇంట్లో వాడని పాత వస్తువులను అమ్మి ₹90,000 సేకరించారు.

4 / 5
అత్యవసర నిధి, స్నోబాల్ పద్ధతిలో అప్పుల చెల్లింపు: మళ్లీ కొత్త అప్పు చేయకుండా ఉండేందుకు ₹20,000ను ఎమర్జెన్సీ ఫండ్‌గా పక్కన పెట్టి, మిగిలిన డబ్బుతో అత్యధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు అప్పును, ఆపై బైక్ లోన్‌ను ముందుగా క్లియర్ చేశారు. ఆ తర్వాత పర్సనల్ లోన్‌కు ప్రీ-పేమెంట్ల ద్వారా అసలు మొత్తాన్ని వేగంగా తగ్గించి 24 నెలల్లో పూర్తి అప్పుల భారం నుండి విముక్తి పొందారు.

5 / 5
Follow Us