Home Loan: హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్.. ఆ ఒక్క పనితో బోలెడంత వడ్డీ మిగులు
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో రుణం తీసుకోవడం అనేది సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ చిరకాల కోరిక ఉన్న ఇంటి నిర్మాణ సమయంలో రుణం తీసుకోవడం అనేది తప్పనిసరి అవసరంగా ఉంటుంది. అయితే ఈ రుణం తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద మొత్తంలో సొమ్ము ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి రుణం పొందే సమయంలో ఫ్లోటింగ్ వడ్డీ రేటును ఎంచుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి రుణం విషయంలో ఫ్లోటింగ్ వడ్డీ రేటును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.