Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ఛార్జీలు కన్ఫార్మ్.. ఎలా ఉన్నాయో చూడండి

Updated on: Jan 11, 2026 | 5:20 PM

జనవరి 17న తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ల ఛార్జీల వివరాలను కూడా రిలీజ్ చేశారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఛార్జీలు ఉన్నాయి. ఈ ఛార్జీల వివరాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఈ నెలలో దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది. మొదటి రైలును కోల్‌కత్తాలోని హౌరా నుంచి కామాఖ్యలోని గువహతి మధ్య సర్వీసులు అందించనుంది. జనవరి 17వ తేదీన ఈ రైలుకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందుకు ఏర్పాట్లు ఇప్పటినుంచే జరుగుతున్నాయి.

2 / 5
హౌరా-గువహతి మధ్య తిరిగే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ ఛార్జీలను రైల్వేశాఖ ఖరారు చేసింది. ఈ మేరకు ఐఆర్‌సీటీ వెబ్‌సైట్లో పొందుపర్చింది. ఈ వివరాల ప్రకారం హౌరా-గువహతి మధ్య వెయ్యి కిలోమీటర్లు ఉంటుంది. ఈ ట్రైన్ ఛార్జీలు ఇలా ఉన్నాయి.

3 / 5
థర్డ్ ఏసీ టికెట్ రూ.2,300గా ఉండగా.. సెకండ్ ఏసీలో రూ.3 వేలు ఉంటుంది. ఇక ఫస్ట్ క్లాస్ ఏసీ ఛార్జీ రూ.3,600గా ఉంది. ఇక టికెట్‌తో పాటు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తారు. ఇక మినిమం ఛార్జబుల్ దూరం 400 కిలోమీటర్లుగా ఉంది.

4 / 5
400 కిలోమీటర్లకు ఫస్ట్ క్లాస్ ఏసీలో రూ.1520, సెకండ్ క్లాస్ ఏసీలో రూ.1240, థర్డ్ ఏసీలో రూ.960గా ఉంది. ఇక 500 కిలోమీటర్లకు ఫస్ట్ క్లాస్ ఏసీలో రూ.1900, సెకండ్ ఏసీలో రూ.1550, థర్డ్ క్లాస్ ఏసీలో రూ.1200గా ఛార్జీ ఉంది.

5 / 5
ఇక కేవలం కన్ఫార్మ్‌డ్ టికెట్లు పొందినవారు మాత్రమే ఈ రైల్లో ప్రయాణించడానికి వీలవుతుంది. ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్, పార్షియల్ కన్పా్ర్మ్‌డ్ టికెట్లు కలిగినవారు ప్రయాణించడానికి సాధ్య పడదు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో చార్జీలను వసూలు చేస్తున్నారు.