
యూఎస్ ఆధారిత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఫిస్కర్ తన సరికొత్త ఈవీ ఓషన్‌ను భారతీయ మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రూ. 79 లక్షల నుంచి రూ.84 లక్షల మధ్య అందుబాటులో ఉండనుంది. ఈ కారు భారతదేశంలో టాప్ స్పెక్ వెర్షన్ అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ కారు మొదటి బ్యాచ్‌లో భాగంగా కేవలం వంద కార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ కారు ఏడాది చివర్లో కానీ 2024 ప్రారంభంలో కానీ అందుబాటులోకి రానుంది.

టాటా మోటర్స్ తన మైక్రో ఎస్‌యూవీ పంచ్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్ భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కారు టాటా టియాగో వంట పవర్ ట్రెయిన్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు. పంచ్ ఈవీ ధర రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు కనుక భారతదేశంలో రిలీజ్ బడ్జెట్ ధరల్లో అందుబాటులోఉండే టాప్ ఎస్‌యూవీ ఈవీగా నిలువనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 300కు సంబంధించిన ఎక్స్‌యూవీ 400 ఈవీ వెర్షన్‌ను కూడా భారతదేశంలో రిలీజ్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కారు ధర రూ.14 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉంటుంది. ఈ ఎక్స్‌యూవీ 400 భారత మార్కెట్‌లో టాటా నెక్సాన్‌కు గట్టి పోటీనిస్తుంది. కాబట్టి మహీంద్రా ఫేస్ లిఫ్ట్ ఈవీ మంచి పోటీనిస్తుంది.

వోల్వో కంపెనీ కూడా తన ఈఎక్స్ 90 ఈవీ వెర్షన్‌ను మరికొన్ని రోజుల్లో భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈఎక్స్ 90 అంటే 7 సీటర్ ఎస్‌యూవీ. అయితే ఈ కారు ధర మాత్రం భారతదేశంలో రూ.90 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకూ ఉంటుంది.

చైనా ఆధారిత బీవైడీ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కారు కంపెనీగా ఉంది. ఈ కంపెనీకు సంబంధించిన బీవైడీ సీల్ భారతీయ మార్కెట్‌లో ప్రవేశనించనుంది. ఈ కారు ధర రూ.55 లక్షల నుంచి రూ. 65 లక్షల మధ్య ఉంటుందని అంచనా.