
Ampere V48: మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ V48 ఇది కేవలం రూ. 37,390 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో ప్రారంభం అవుతుంది. ఒక చిన్న 1.15 kWh బ్యాటరీతో పనిచేస్తుంద. ఒకసారి చార్జ్ చేస్తే 60-70 కిమీ పరిధి వస్తుంది. ఈ ఇ-స్కూటర్ సిటీ రైడ్‌లకు చాలా అనువుగా ఉంటుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలుగుతుంది.

Hero Electric Optima CX (Single Battery): సింగిల్, డబుల్ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఒక బ్యాటరీతో ఫుల్ చార్జ్ చేస్తే 82 కిమీ పరిధి వస్తుంది. ఇది గరిష్టంగా 42 కిమీ/గం వేగాన్నిఅందుకుంటుంది. దీని ధర రూ. 67,190 ఉంది. బ్యాటరీ 1.5 kwh సామర్థ్యంతో వస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది.

Bounce Infinity: ఈ స్కూటర్‌లు మూడు సంవత్సరాలు లేదా నలభై వేల కిలోమీటర్ల వారంటీతో వస్తాయి. ఇది గరిష్టంగా 65 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. సీటు కింద 1.9 kWh మార్చుకోగలిగిన బ్యాటరీతో వస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 85 కిమీ మైలేజీ వస్తుంది. దీని ధర రూ. 70,, 499గా ఉంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 5 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

Okinawa Ridge 100: చాలా తక్కువ ధరలో వచ్చే హై-స్పీడ్ స్కూటర్లలో ఒకటి. ఇది 3.12 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 149 కి.మీ. మైలేజీ వస్తుంది. రీజెనరేటివ్ ఎనర్జీతో కూడిన ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంట్-థెఫ్ట్ అలారంతో సెంట్రా లాకింగ్, జియో-ఫెన్సింగ్, ట్రాకింగ్ , మానిటరింగ్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 74, 817 గా ఉంది. గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది.

Hero Electric Photon LP Series: దీనిలో ఒక చిన్న 1.8 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 90 కి.మీ.ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ. 86,391 గా ఉంది. చార్జింగ్ టైం 5 గంటలు కాగా టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు.

TVS iQube Electric.. ఈ స్కూటర్‌లు గత సంవత్సరం 10 కొత్త కలర్ ఆప్షన్‌లతో మూడు కొత్త వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. బేస్ ఐక్యూబ్, మిడ్-స్పెక్ ఐక్యూబ్ ఎస్ లు 3.04 kWh బ్యాటరీతో పనిచేస్తుండగా, ఐక్యూబ్ ఎస్టీ ST 4.56 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ప్రసుతం ఈ ఐక్యూబ్ ఎస్టీ మాత్రమే బుకింగ్ కు అందుబాటులో ఉంది. దీని ధర 99,130 ఉంది. ఒక్కసారి బ్యాటరీ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఫుల్ చార్జ్ అవడానికి నాలుగున్నర గంటలు పడుతుంది. టాప్ స్పీడ్ గంటకు 78 కిలోమీటర్లు.

Ola S1.. ప్రస్తుతం, S1 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది - S1 ఎయిర్, S1, యు S1 ప్రో. మూడు వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలు ఉన్నాయి. S1 ఎయిర్ 2.5 kWh , S1 శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌కు శక్తినిచ్చే 3 kWh బ్యాటరీతో వస్తుంది. ఎస్ 1 ధర రూ. 1,04,999గా నిర్ణయించారు. దీనిలో బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 141 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. గంటకు 95 కిలోమీటర్ల గరిష్టవేగంతో వెళ్లకలుగుతుంది. బ్యాటరీ ఫుల్ చార్జింగ్ కు 5 గంటలు తీసుకుంటుంది.

Ather 450X: గత సంవత్సరం, ఏథర్ 450X, 450 ప్లస్ స్కూటర్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఏథర్ 450 ఎక్స్ ధర రూ. 1,35,452 కాగా, దీనిలో 2.6 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 105 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అందుకుంటుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి ఐదు గంటల సమయం పడుతుంది.

Bajaj Chetak.. ఈ జాబితాలో అత్యంత ఖరీదైనది బజాజ్ చేతక్. దీని ఖరీదు రూ. 1,51,958 ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 3 kWh ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే 85 నుంచి 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. టాప్ స్పీడ్ 70 కిలోమీటర్లు. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి నాలుగు గంటలు పడుతుంది.