- Telugu News Photo Gallery Business photos Budget 2025 Finance Minister increased TDS limit for landlords paying rent
Budget 2025: బడ్జెట్‌లో అద్దె చెల్లించే యజమానులకు శుభవార్త.. ఆదాయ పరిమితి పెంపు!
Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం దేశ బడ్జెట్‌ను సమర్పించారు. అద్దె చెల్లించే యజమానులకు ఈ బడ్జెట్‌లో శుభవార్త అందించారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆస్తి ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఏడాదికి రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని బడ్జెట్ లో తెలిపారు..
Updated on: Feb 04, 2025 | 7:31 AM

2025-26 ఆర్థిక సంవత్సరానికి అద్దెపై TDS వార్షిక పరిమితిని పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది తక్కువ అద్దెతో పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194-I ప్రకారం, ఇంటి అద్దెగా ఏదైనా మొత్తాన్ని స్వీకరించేటప్పుడు అద్దె ఆదాయం ఆర్థిక సంవత్సరంలో రూ. 2.4 లక్షలకు మించకూడదు.

అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు ఆదాయపు పన్ను మినహాయించాలి. అయితే, 2025-26 బడ్జెట్‌లో అద్దె ఆదాయంపై ఈ పన్ను మినహాయింపు పరిమితిని నెలకు రూ. 50,000 అంటే సంవత్సరానికి ఆరు లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. ఈ నిబంధన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు లేదా హిందూ అవిభక్త కుటుంబానికి కూడా వర్తిస్తుంది.

ఈ నిబంధనపై డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆర్తి రావతే మాట్లాడుతూ.. లీజింగ్ అంటే కొన్ని నెలల పాటు భూమి లేదా యంత్రాలను అద్దెకు తీసుకుని, అద్దె రూ. 50,000 దాటితే మాత్రమే TDS మినహాయించబడుతుంది.

ఈ విషయమై CREDAI-MCHI చైర్మన్ డొమినిక్ రోమెల్ మాట్లాడుతూ.. అద్దెపై వార్షిక TDS పరిమితిని రూ.6 లక్షలకు పెంచడం వల్ల చిన్న పన్ను చెల్లింపుదారులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

బడ్జెట్‌లో రూ.6 లక్షల వరకు అద్దెపై టీడీఎస్ పెరగడంతో రెండో ఇంటిని అద్దెకు తీసుకునే ట్రెండ్ పెరుగుతుంది. ఇది మరో ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఇది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.





























