- Telugu News Photo Gallery Technology photos Buy these 5G phones at the cheapest price, Here are the price and brand details, smartphones under 25k details in telugu
Smart Phones Under 25k: ఈ 5జీ ఫోన్లను అత్యంత చౌకగా కొనేయండి..ధర, బ్రాండ్ వివరాలు ఇవే..!
నేడు స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికీ కనీస అవసరంగా మారింది. నిత్య జీవితంలో అన్ని పనులకు తప్పనిసరిగా ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ లో దొరుకుతున్న ఫోన్లలో బెస్ట్ ఫీచర్లు, తక్కువ ధర గల ఫోన్ ను ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టమే. కేవలం రూ.25 వేల కంటే తక్కువ ధరలో ప్రముఖ కంపెనీల 5 జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు, ప్రత్యేకతలు, ధర తదితర వాటిని తెలుసుకుందాం.
Srinu |
Updated on: Feb 04, 2025 | 5:00 PM

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ స్లైలిష్ లుక్ తో ఆకట్టుకుంటోంది. 8 మి.మీ కంటే తక్కువ మందం, 175 గ్రాముల బరువు, దుమ్ము, నీటిని నిరోధించే ఐపీ 68 రేటింగ్ బాగున్నాయి. 6.7 అంగుళాల పీ-ఓలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని 68 డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ తో కేవలం 15 నిమిషాల్లోనే సున్నా నుంచి 50 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ రూ.23,999కి అందుబాటులో ఉంది.

తక్కువ ధరకు లభించే బెస్ట్ ఫోన్లలో వన్ ప్లస్ నార్డ్ సీఈ4 స్మార్ట్ ఫోన్ ఒకటి. దీనిలో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్, 16 ఎంపీ సెల్పీ కెమెరాలు అమర్చారు. దీనిలోని 5500 ఎంఏహెచ్ బ్యాటరీని 100 డబ్ల్యూ సూపర్ వూక్ చార్జర్ తో కేవలం 30 నిమిషాల్లో పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ.24,999.

బడ్జెట్ లో లభించే మంచి ఫోన్లలో పోకో ఎఫ్6 ముందు వరుసలో ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 ఎస్ జెన్ 3 ఎస్వోసీ ఆధారంగా పనిచేస్తుంది. గేమింగ్ తో పాటు అన్ని పవర్ ఇంటెన్సివ్ పనులను చక్కగా చేసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఆకట్టుకుంటున్నాయి. 50 ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 20 ఎంపీ సెల్ఫీ కెమెరాలు అమర్చారు. దీనిలోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీని 90 డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ ను ఉపయోగించి 40 నిమిషాల కంటే తక్కువ సమయంలో చార్జింగ్ చేసుకునే వీలుంది. ఈ ఫోన్ ధర రూ.24,999.

రియల్ మీ పి2ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల ఓలెడ్ డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 ఎస్ జెన్ 2 ఎస్వోసీ, 12 జీబీ ర్యామ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 32 ఎంపీ ఫంట్ర్ కెమెరా ఏర్పాటు చేశారు. దీనిలోని 5200 ఎంఏహెచ్ బ్యాటరీని 80 డబ్ల్యూ సూపర్ వూక్ చార్జర్ తో కేవలం 19 నిమిషాల్లోనే దాదాపు 50 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు, పూర్తి చార్జింగ్ కోసం 50 నిమిషాలు పడుతుంది. దీనిలోని 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజీ వెర్షన్ రూ.21,999, అలాగే 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజీ వెర్షన్ రూ.24,999కి అందుబాటులో ఉన్నాయి.

ఐక్యూ జెడ్9ఎస్ ప్రో, వివో టీ3 ప్రో అనేవి వేర్వేరు రంగుల్లో లభించే రెండు రకాల ఫోన్లు అయినప్పటికీ డిజైన్ నుంచి స్పెసిఫికేషన్ల వరకూ ఓకేలా ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో వీటి ధరలను గమనించి కొనుగోలు చేసుకోవాలి. 6.77 అంగుళాల అమెలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 7 జెన్ ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర పత్యేకతలు ఉన్నాయి. 50 ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 16 ఎంపీ సెల్ఫీ కెమరాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు ఫోన్లూ రూ.24,999కి అందుబాటులో ఉన్నాయి.





























