- Telugu News Photo Gallery Technology photos Lava launches another new smartphone.. middle are the are the real target, Lava Yuva smart details in telugu
Lava Yuva: మరో నయా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన లావా.. వారే అసలు టార్గెట్..!
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ లవర్స్ పెరుగుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో ఫోన్లను కోరుకుంటున్నారు. అయితే తక్కువ ధరలో 5జీ ఫోన్ మాత్రం అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ లావా కేవలం రూ.5999కే 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో లావా లాంచ్ చేసిన నయా ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Feb 04, 2025 | 5:15 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా యువ స్మార్ట్ పేరుతో కేవలం రూ.5999కే 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ మూడు రంగులలో లభిస్తుంది. గ్లోసీ లావెండర్, గ్లోసీ వైట్, గ్లోసీ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

లావా యువ స్మార్ట్ త్వరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉచిత హెూమ్ సర్వీస్‌తో పాటు ఒక సంవత్సరం వారంటీతో ఈ ఫోన్ ప్రత్యేకత.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే లావా యువ స్మార్ట్ 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లేతో వస్తుంది. అలాగే 720 × 1600 పిక్సెల్ రిజల్యూషన్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 13 ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ సెన్సార్, సెల్ఫీల కోసం 5 ఎంపీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. యునిసాక్ 98663ఏ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకత.

లావా యువ స్మార్ట్ ఫోన్ 3జీబీ ర్యామ్‌తో వస్తుంది. అలాగే తగినంత నిల్వ ఉంటే వర్చువల్గా మరో 3 జీబీను విస్తరించవచ్చు. ఇన్‌బుల్ట్ మెమరీ విషయానికి వస్తే 64 జీబీతో వస్తుంది. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో 512 జీబీ వరకు విస్తరించుకునే సౌలభ్యం ఉంది.

లావా యువ స్మార్ట్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్‌తో రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ 10 వాట్స్ టైప్-సి ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంది. ఫేస్ అన్లాక్ సపోర్ట్ సైడ్- మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రధాన ప్రత్యేకతలుగా ఉన్నాయి.





























