Broccoli vs Cabbage: బ్రోకలీ లేదా క్యాబేజీ.. బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఏది మంచిది?

Updated on: Jan 18, 2026 | 5:42 PM

ఈ మధ్యకాలంలో చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని, ఫిట్‌గా కనిపించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక డైట్స్ ఫాలో అవుతున్నారు. డైట్ చేసే సందర్భంలో ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. వీటిలో మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే బరువు తగ్గాలనకునే వారికి బ్రోకలీ లేదా క్యాబేజీ రెండింటిలో ఏది ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
 చాలా మంది బ్రోకలీ అనే సరపేట్‌గా కూరగాయాల్లో ఒకటి అనుకుంటారు. కానీ బ్రోకలీ కూడా క్యాబేజీ కుటుంబానికి చెందిన ఆకుపచ్చ క్రూసిఫెరస్ కూరగాయ. USDA (యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్) డేటా ప్రకారం, 100 గ్రాముల బ్రోకలీలో సుమారు 34 కేలరీలు, సుమారు 89 గ్రాముల నీరు, 2.8 గ్రాముల ప్రోటీన్, చాలా తక్కువ కొవ్వు, 2.6 గ్రాముల ఫైబర్ మరియు 1.7 గ్రాముల సహజ చక్కెర ఉంటాయి. ఇంకా, బ్రోకలీ విటమిన్ సి, విటమిన్ కె ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

2 / 5
 బ్రోకలీలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో గ్లూకోసినోలేట్స్, సల్ఫోరాఫేన్ వంటి నిర్దిష్ట సల్ఫర్ సమ్మేళనాలు కూడా ఉన్నాయి, ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బ్రోకలీలోని ఫైబర్, ముఖ్యంగా కరిగే ఫైబర్, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా, ఫైబర్ కార్బోహైడ్రేట్‌లను నెమ్మదిగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3 / 5
 క్యాబేజీలో పోషకాలు : క్యాబేజీ బ్రాసికా కుటుంబానికి చెందినది, ఇందులో బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే వంటి కూరగాయలు ఉంటాయి. USDA డేటా ప్రకారం, 100 గ్రాముల క్యాబేజీలో దాదాపు 25 కేలరీలు, దాదాపు 92 గ్రాముల నీరు, 1.2 గ్రాముల ప్రోటీన్, చాలా తక్కువ కొవ్వు, 2.5 గ్రాముల ఫైబర్ , 3.2 గ్రాముల సహజ చక్కెర ఉంటాయి. క్యాబేజీ విటమిన్ సి, విటమిన్ కె లకు కూడా మంచి మూలం, ఇవి రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావిస్తారు.

4 / 5
 బ్రోకలీ లేదా క్యాబేజీలో ఏది మంచిది?: పోషకాల పరంగా చూసుకుంటే క్యాబేజీ కంటే బ్రోకలీని ఎక్కువ పోషకాలు ఉంటాయి.  అంటే ఇందులో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు, వ్యాధి-రక్షణ సమ్మేళనాలు ఉంటాయి. క్యాబేజీలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ బ్రోకలి కన్నా తక్కువగా ఉంటాయి. అయితే దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం సులభం. బ్రోకలీ, క్యాబేజీ రెండూ ఆరోగ్యకరమైనవి. మీకు ఏది సరైనదనేది..  మీ అవసరాలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. మీకు ఎక్కవ పోషకాలు కావాలంటే బ్రోకలీ మీకు మంచిది. అయితే, క్యాబేజీని రోజువారీ భోజనాలకు ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తారు.

5 / 5