
వ్యాయామం: ఈ కొన్ని చిన్న చిన్న అలవాట్ల కారణంగానే నా జీవితంలో మెదడు పనితీరును మెరుగుపర్చుకున్నానని డాక్టర్ చెబుతున్నారు. అందులో మొదటి వ్యాయామం. వర్కౌట్స్ చేయడం అనేది కేవలం కండరాల పెరుగుదలకు, బరువు తగ్గడమే కాకుండా మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీని వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతంది. అలాగే కొత్త నాడీ కనెక్షన్‌లను పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం, రన్నింగ్, ద్యానం, యోగా వంటి సాధనాలతో మీ మెదడు పనితీరుతో పాటు దాని వృద్యాప్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

సరైన నిద్ర: నిద్ర అనేది కేవలం సోమరితనం కాదని.. ఇది మెదడు పనితీరును మెరుగుపర్చడంలో అద్భుతంగా పనిచేస్తుందని ఆయన చెబుతున్నారు. మనం నిద్రపోయేప్పుడు మన మనస్సులోని చెడు ఆలోచనలను మెదడు తొలగిస్తుందని..జ్ఞాపకాలను ఏకీకృతం చేస్తుంది. భావోద్వేగ నియంత్రణను రీసెట్ చేస్తుందన్నారు. దీని వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందననారు. అందుకే రోజుకూ 7-8గంటల సరైన నిద్ర అవసరమని చెబుతున్నారు.

కొత్త విషయాలను తెలుసుకోవడం: చాలా మంది ఏదైనా క్షమైన విషయాన్ని నేర్చుకోవడానికి వెనకాడుతారు. కానీ అలాంటి వాటిని సాధించేందుకు శ్రమించడం,కొత్త నైపుణ్యం, కొత్త భాష, తెలియని అంశాలు నేర్చుకోవడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుందని ఆయన చెబుతున్నారు. అలాగే మీరు రోజుచేసే పనుల్లో కూడా కొత్త దనాన్ని వెతుక్కోవడం వల్ల మీరు మెదడు పనితీరును మెరుగుపర్చుకోవచ్చు.

సరైన ఆహారం: మనం తీసుకునే ఆహారం మన మొత్తం ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం సరైన ఆహారం తీసుకోవచ్చడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మెదడు పనితీరుకు మెరుపర్చడంలో కీలక పాత్ర పోషించే కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, గింజలు, చేపలు, నీరు తీసుకోవడం మంచింది. అలాగే ఎక్కువ ప్రాసెస్ చేసి ఆహారాలకు దూరంగా ఉండాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మీ మెదడుకు పోషకాలు అంది అది యాక్టీవ్‌గా పనిచేస్తుంది.

మనఃశాంతి: ప్రస్తుతం రోజులో ప్రతి ఒక్కరికి పని ఒత్తడి పెరిగింది. దీర్ఘకాలిక ఒత్తిడి అనేది అన్నింటికంటే వేగంగా మొదడు పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మానసికంగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఒత్తిడి తగ్గించే అలవాట్లను అవర్చుకోండి. అంటే మ్యూజిక్ వినడం, వ్యాయామం, యోగా, దాన్యం, ఒంటరిగా చిన్న నడకలు చేయడం వంటివి నా నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ప్రశాంతమైన మెదడు ఆరోగ్యకరమైన మెదడు, వృద్ధాప్యం విషయానికి వస్తే భావోద్వేగ నియంత్రణ జ్ఞాపకశక్తి వలె అంతే ముఖ్యమైనది. ఈ అలవాట్లను మీ జీవనశైలిలో చేర్చుకోవడం ద్వారా మీ మెదడు పనితీరును మెరుగుపర్చుకోవచ్చు.