Bone health: మీ ఎముకలను ఉక్కులా మార్చే ఆహారాలు.. వీటిని తప్పక తీసుకోవాలి

Updated on: Dec 08, 2024 | 1:09 PM

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండాలి. ముఖ్యంగా కొందరికి చిన్న వయసులో ఎముకల సమస్యలు తలెత్తుతుంటాయి. ఎప్పుడో 60 ఏళ్లకు రావల్సిన కీళ్ల నొప్పులు 30లలోనే వస్తుంటాయి. ఇలా జరగకూడదంటే..

1 / 5
నేటికాలంలో ఆరోగ్యంగా ఉండడమంటే నిజంగా సవాలే. అందులోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు ఎముకలు దృఢంగా ఉండేందుకు ఆహారంలో రకరకాల మార్పులు చేసుకోవడం చాలా అవసరం. లేదంటే ఎముకల ఆరోగ్యం, దృఢత్వం దెబ్బతింటుంది. కాబట్టి మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

2 / 5
లేదంటే ఎముకల ఆరోగ్యం దెబ్బతిని బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఎముకలు దృఢంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు తీసుకోవాలి. అవేంటంటే.. గుడ్డు పచ్చసొన, ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, విటమిన్ డి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఈ కారకాలన్నీ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

3 / 5
సాల్మన్ చేపలు ఎముకలు కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. అలాగే ఒమేగా-3ని పెంచుతుంది. ఇది అలసటను తగ్గిస్తుంది. ఎముకలకు కావలసిన బలాన్ని అందిస్తుంది.

4 / 5
పాలకూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల సాంద్రతను బలపరుస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ ఎ, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలకూరను రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

5 / 5
పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే, ఎముకల ఆరోగ్యానికి వీటిని తీసుకోవడం చాలా అవసరం. వీలైతే రోజూ పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారుతాయి. అందుకే పిల్లలు రోజూ పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.