Blood Clots: శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త! ప్రాణాలకు ప్రమాదం..

|

May 03, 2024 | 9:25 PM

శరీరంలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం. ఫలితంగా పలు రకాల ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి. అసలు శరీరంలో రక్తం గడ్డకట్టడానికి ప్రమాద కారకాలు ఏమిటి? వాటిని ఎలా నిరోధించాలి? వంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. రక్తం గడ్డకట్టడానికి దారితీసే కారణాల్లో అనేక అంశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రారంభ దశలో దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే రక్తం గడ్డకట్టి గుండెపోటు..

Blood Clots: శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. జాగ్రత్త! ప్రాణాలకు ప్రమాదం..
Blood Clots
Follow us on

శరీరంలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం. ఫలితంగా పలు రకాల ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి. అసలు శరీరంలో రక్తం గడ్డకట్టడానికి ప్రమాద కారకాలు ఏమిటి? వాటిని ఎలా నిరోధించాలి? వంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. రక్తం గడ్డకట్టడానికి దారితీసే కారణాల్లో అనేక అంశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రారంభ దశలో దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే రక్తం గడ్డకట్టి గుండెపోటు, స్ట్రోక్‌లకు దారితీస్తాయి. ఇది ప్రాణాంతకం కావచ్చు. చాలా సందర్భాలలో గుండెపోటు, స్ట్రోక్‌లకు రక్తం గడ్డకట్టడమే ప్రధాన కారణం.

గర్భనిరోధక మాత్రలు వేసుకునే ప్రతి 1 మిలియన్ మహిళల్లో 1200 మందికి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని మెట్రో హాస్పిటల్‌లోని కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధీర్ గుప్తా చెబుతున్నారు. కాబట్టి శరీరంలో రక్తం గడ్డకట్టడానికి ఉన్న ప్రధాన కారణాలలో గర్భనిరోధకాలు కూడా ఒక ముఖ్య అంశమే. రాజీవ్ గాంధీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం డాక్టర్‌ అజిత్ జైన్ ఏం చెబుతున్నారంటే.. కరోనా వైరస్ కారణంగా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్ చాలా సందర్భాలలో సంభవిస్తుంది. ఈ వైరస్ గుండె ధమనులలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. దీంతో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని అన్నారు.

అలాగే ప్రతి 1 మిలియన్ ధూమపానం చేసేవారిలో 17,000 మందికి రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నాయి. అలాగే ఈస్ట్రోజెన్ ఉన్న మందులు తీసుకుంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని డాక్టర్ కుమార్ హెచ్చరిస్తున్నారు. శరీరంలో కొవ్వు పెరగడం, మధుమేహం, కీళ్లనొప్పులు, అధిక బీపీ వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందని ఆయన పేర్కొన్నారు. రక్తం గడ్డ కట్టితే రక్త ప్రవాహానికి అంతరాయం ఏర్పడి ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి సంభవిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.