- Telugu News Photo Gallery Black around the mouth can be reduced with these tips, check here is details in Telugu
Skin Tips: మూతి చుట్టూ నల్లగా ఉందా.. ఈ టిప్స్‌తో పోవాల్సిందే!
చాలా మందిలో ముఖం అంతా ఒక రంగులో ఉంటే.. మూతి మాత్రం కాస్త నల్లగా ఉంటుంది. దీంతో చాలా మంది మహిళలు బయటకు వెళ్లడానికి, నలుగురిలో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నలుపు తగ్గించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా ఫలితం లేని వాళ్లు ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి. పాల మీద మీగడ, పసుపుతో మీ మూతి చుట్టూ ఉండే నలుపును తగ్గించవచ్చు. మీగడలో కొద్దిగా పసుపు, కొద్దిగా శనగ పిండి కలిపి పేస్టులా చేసుకోండి. మూతి చుట్టూ రాసి మర్దనా..
Updated on: Jun 13, 2024 | 6:00 PM

చాలా మందిలో ముఖం అంతా ఒక రంగులో ఉంటే.. మూతి మాత్రం కాస్త నల్లగా ఉంటుంది. దీంతో చాలా మంది మహిళలు బయటకు వెళ్లడానికి, నలుగురిలో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నలుపు తగ్గించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా ఫలితం లేని వాళ్లు ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.

పాలలో ఉండే ప్రొటీన్ , దాని శక్తి మెదడును బూస్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల, పరగడుపునే పాలు తాగడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీంతో జీర్ణవ్యవస్థ కూడా మెరుగవుతుంది. ఇది మెదడుకు పదును పెడుతుంది. ఎముకలను బలపరుస్తుంది.

కలబందతో కూడా మూతి చుట్టూ ఉండే నలుపును పోగొట్టుకోవచ్చు. ఇందులో ఉండే ఔషధ గుణాలు చర్మాన్ని క్లీన్ చేయడమే కాకుండా.. కాంతివంతం చేస్తుంది. చర్మాన్ని క్లీన్ చేయడంలో కలబంద చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.

రోజ్ వాటర్‌తో కూడా మూతి చుట్టూ ఉండే నలుపును తగ్గించి.. తెలుపుగా మార్చుతుంది. చర్మ రంగును మార్చడంలో రోజ్ వాటర్ ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. రోజ్ వాటర్‌లో తేనె కలిపి.. అప్లై చేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మ రంగు మారుతుంది.

బంగాళ దుంపలో కూడా చర్మ రంగును మెరుగు పరిచే లక్షణాలు ఉన్నాయి. అందుకే ఈ బంగాళ దుంప రసాన్ని మూతి చుట్టూ రాసి మర్దనా చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల స్కిన్ టోన్ అనేది మెరుగు పడుతుంది. దీంతో నోటి చుట్టూ ఉండే నలుపును పోగొట్టుకోవచ్చు.




