
అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతోన్న వేళ పశ్చిమ బెంగాల్ రగిలిపోతోంది. తాజాగా జరిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి మంటలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య ఫైట్ పీక్స్‌కు చేరింది.

ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. పోటాపోటీగా ఈసీని కలిసి ఫిర్యాదు చేశాయి. ఇలాఉంటే, మమతాబెనర్జీపై దాడి వెనుక బీజేపీ హస్తముందని ఆరోపిస్తున్నారు టీఎంసీ నేతలు. మమత దాడి ఘటనపై ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం మమతకు అదనపు భద్రత కల్పించాలని వినతిప్రతం అందించారు. ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈసీదేనన్నారు.

మరోవైపు ఇటు బీజేపీ నేతలు కూడా ఈసీని కలిశారు. ఈ మొత్తం ఘటనపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తోంది కమలం పార్టీ. సానుభూతి కోసమే మమత..దాడి నాటకం ఆడుతున్నారని ఫిర్యాదు చేశారు. మరోవైపు మమతపై దాడి ఘటనతో..ఇవాళ రిలీజ్ చేయాల్సిన టీఎంసీ మేనిఫెస్టో వాయిదా పడింది. మమత డిశ్చార్జ్ అయ్యాకే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది తృణమూల్ కాంగ్రెస్.

ఇక మమతపై దాడి ఘటనతో పోటాపోటీ నిరసనలకు దిగుతున్నారు బీజేపీ, టీఎంసీ నేతలు. పెద్దసంఖ్యలో రోడ్డుపైకొచ్చిన ఇరు పార్టీల శ్రేణులు.. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. టైర్లను కాల్చి సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కమలం పార్టీ కార్యకర్తలు. మమత సానుభూతి కోసం నాటకాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు తమ అధినేత్రిపై దాడికి నిరసనగా టీఎంసీ శ్రేణులు కూడా పలు చోట్ల ఆందోళనలకు దిగారు. తనపై నలుగురైదుగురు దాడిచేశారని ..గాయాల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డానని ఆరోపిస్తున్నారు ముఖ్యమంత్రి మమత. ఐతే మమతపై దాడి ఘటనపై సీరియస్ అవుతున్నారు బెంగాల్ విపక్ష నేతలు.

మరోవైపు తమ అధినేత్రిపై దాడికి నిరసనగా టీఎంసీ శ్రేణులు కూడా పలు చోట్ల ఆందోళనలకు దిగారు. తమ నాయకురాలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు

ఇదంతా ఓ డ్రామా అని..పోలీసులు మమత చేతుల్లోనే ఉంటే దాడి ఎలా జరిగిందని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. ఎన్నికల వేళ సానుభూతి పొందేందుకు నాటకాలాడుతున్నారని ఆరోపిస్తోంది. ఇటు బీజేపీ కూడా ఇది ప్రమాదం మాత్రమేనని కొట్టిపారేసింది.