AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hibiscus Plant: రూపాయి ఖర్చు లేకుండా ఈ మూడు కలిపితె చాలు.. మందార విరగ పూస్తుంది

ఇంటి పెరట్లో లేదా బాల్కనీ కుండీలలో మందార మొక్కలను చాలామంది ఎంతో ముచ్చటపడి పెంచుకుంటారు. అయితే సరైన పోషకాలు అందక మొక్కకు మొగ్గలు రాకపోవడం, ఒకవేళ వచ్చినా పసుపు రంగులోకి మారి రాలిపోవడం లేదా పువ్వులు సగం మాత్రమే వికసించడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

Phani CH
|

Updated on: Sep 02, 2026 | 5:37 PM

Share
మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఎరువులు వాడాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లో ప్రతిరోజూ పారబోసే పదార్థాలతోనే మందార మొక్కలకు బలాన్నిచ్చే అమృతం లాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో, మొక్క సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 5
ముఖ్య చిట్కాలు:  రాలిన ఎండిన ఆకులు, పువ్వులను ఎప్పటికప్పుడు కుండీలోంచి తొలగించాలి. లేకపోతే తేమ పెరిగి ఫంగస్ చేరి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. తరువాత  మొక్కపై ముదిరిన పెద్ద ఆకులను తుంచేయడం వల్ల మొక్క యొక్క శక్తి కొత్తగా వచ్చే చిగుర్లు, మొగ్గలకు అందుతుంది. వర్షాకాలం, చలికాలం కాలాల్లో తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి పురుగు పట్టిన కొమ్మలను వెంటనే కత్తిరించి వేరుచేయాలి.

2 / 5
మ్యాజికల్ లిక్విడ్  ఎరువు తయారీకి మనకు మూడు ముఖ్యమైన పదార్థాలు కావాలి: మొదటిది వంటింట్లో కందిపప్పు , బియ్యం లేదా మినప్పప్పు కడిగిన నీటిలో మొక్కలకు మేలు చేసే నైట్రోజన్, మైక్రోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. రెండవది తెల్ల లేదా నల్ల నువ్వుల్లో మొక్కలకు అవసరమైన క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మొగ్గలు పండుబారి రాలిపోకుండా దృఢంగా నిలబడేలా చేస్తుంది. మూడవది బెల్లం మట్టిలోని మేలు చేసే సూక్ష్మజీవుల వృద్ధికి ఆహారంగా పనిచేసి మట్టి సారాన్ని పెంచుతుంది.

3 / 5
తయారుచేసే విధానం & వాడే పద్ధతి: ఒక మూత ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో 2 లీటర్ల కందిపప్పు కడిగిన నీటిని తీసుకోవాలి. అందులో ఒకటిన్నర స్పూన్ నువ్వుల పొడి, రెండు స్పూన్ల బెల్లం వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. డబ్బాపై మూతపెట్టి 3 రోజుల పాటు పులియబెట్టాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒకసారి కర్రతో లేదా గరిటెతో కలియతిప్పాలి.

4 / 5
మూడు రోజుల తర్వాత ఈ మిశ్రమం చక్కగా పులిసి మంచి వాసనతో లేత రంగులోకి మారుతుంది. ఇప్పుడు ఈ పులిసిన ఎరువుకు 3 లీటర్ల సాధారణ మంచి నీటిని కలిపి డైల్యూట్ చేసుకోవాలి.  ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను వారానికి ఒక్కసారి చొప్పున సాయంత్రం వేళల్లో కుండీలోని మట్టిలో పోయాలి. మందారాలతో పాటు గులాబీలు, మల్లెలు మరియు టమాటా మొక్కలకు కూడా ఇది అద్భుతంగా పనిచేసి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా మొగ్గలు వచ్చేలా చేస్తుంది.

5 / 5
Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..

తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..

కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!

ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..