Phani CH |
Updated on: Mar 31, 2023 | 11:31 AM
మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. మునక్కాయలో ‘బి’ విటమిన్ కూడా తగిన మోతాదులో ఉంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి.
మునక్కాయలో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. మునగలోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
గర్భిణీ స్త్రీలు మునగకాయను ఎక్కువగా తింటే ప్రసవ సమయంలో నొప్పి తగ్గుతుంది. ప్రసవం తర్వాత అనేక సమస్యలకు ఇది పరిష్కారం. వాంతులు, తల తిరగడం వంటి సమస్యలను నియంత్రిస్తుంది. తల్లి పాలు పెరుగుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి.
మునగకాయ ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది. ఫలితంగా ఎముకలు దృఢంగా మారతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో 'బి' విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
మునగలో విటమిన్ 'సి' ఎక్కువగా ఉంటుంది. గొంతు బొంగురు, జలుబు ఉన్నవారు దీనిని తింటే ఉపశమనం కలుగుతుంది. ఫైబర్, ఇతర పోషకాలు మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. జీవక్రియలను నియంత్రిస్తుంది.