తామర పువ్వుల టీ ఎప్పుడైనా తాగారా..? లాభాలు తెలిస్తే అసలు విడిచిపెట్టరు..

|

Nov 23, 2024 | 5:31 PM

తామర పూలు కేవలం పూజకే పనికొస్తాయని అందరూ భావిస్తారు. కానీ, ఈ మధ్య తామర పూలను కూడా ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే, ఇందులో బోలెడన్ని ఔషద గుణాలు ఉన్నాయని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
తామర పూలలో బోలెడన్ని ఔషద గుణాలు ఉన్నాయంటున్నారు పోషకాహర నిపుణులు. తామర గింజలు, తామర పువ్వులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలామంచిదట. తామర పువ్వులను ఎక్కువగా నాటు వైద్యాలలో ఉపయోగిస్తుంటారు. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. తామర టీ తీసుకోవడం వల్ల తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి.

2 / 5
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు డైలీ తామర టీ తాగితే ఉపశమనం పొందుతారు. డయాబెటిస్ పేషంట్స్ కూడా ఈ టీ తాగవచ్చు. తామర పువ్వుల టీ రుచిగా ఉండటం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ తామర పువ్వుల టీ తాగుతుంటే చాలా అద్బుత ప్రయోజనాలు ఉంటాయి.

3 / 5
తామర పువ్వులతో టీ తయారుచేయడం చాలా ఈజీ. ఇందుకోసం ఒక గిన్నెలో గ్లాసు నీరు పోసుకుని మరిగించాలి.  ఈ నీటిలో ఎండిన లేదా తాజా తామర పువ్వులు వేసి మూత పెట్టి  కొన్ని నిమిషాలు మరిగించాలి. తామర పూలు మరిగించిన నీరు చల్లారిన తరువాత దాన్ని స్టైయినర్ తో ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు ఆ నీటిలో కొద్దిగా కెమికల్స్ లేని, స్వచ్చమైన రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఇందులో రుచి కోసం కాసింత తేనె కూడా కలుపుకోవచ్చు. అంతే తామర పువ్వుల టీ తాగడానికి రెడీ అయినట్టే.

4 / 5
తామర పూలలో అపోమోర్పిన్, న్యూసిఫెరిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, నిరాశ,  ఆందోళన వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. తామర పువ్వుల టీ తీసుకుంటే కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధ సమస్యలు, వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

5 / 5
ముఖ్యంగా మహిళలు తమ పీరియడ్స్ సమయంలో తామర పూల టీని రోజుకు ఒకటి, రెండు కప్పుల వరకు తీసుకుంటే నెలసరి నొప్పి,తిమ్మిరి సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది.