
ఉదయం పూట మంచి ప్రారంభం మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. అందుకే ఉదయం పూట ఏమి తింటారు, ఏమి తాగుతారో వంటివి చాలా ముఖ్యం. వీలైతే ప్రతి ఉదయం ఆరోగ్యకరమైన పానీయాలతో ప్రారంభించడం మంచిది.

ఖాళీ కడుపుతో తులసి నీరు తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తులసిని ఆరోగ్యానికి అమృతంగా పరిగణిస్తారు. చర్మం, కడుపు రెండింటికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకుల నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. చర్మ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో భలేగా పనిచేస్తాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకుల నీటిని తాగితే ఒంట్లో సమస్యలన్నీ పరారవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.