
కావాల్సిన పదార్దాలు : బీరకాయలు, మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు, కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఆవాలు, మినపప్పు, నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

ముందుగా బీరకాయ పైనున్న తొక్కను తీసి వాటిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నె లేదా గ్లాస్ లో పెరుగును తీసుకుని, దానిలో నీళ్లు పోసి మజ్జిగలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్రలో బీరకాయ ముక్కలు, కొద్దిగా నీరు, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వాటిని బాగా ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత దానిలో మజ్జిగను పోసి, మీడియం మంటపై వాటిని మరిగించాలి.

ఇప్పుడు మళ్ళీ వేరే పాన్ తీసుకుని చిన్న పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, దానిలో ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పోపు పెట్టాలి .

సమ్మర్లో ఈ బీరకాయ మజ్జిగ పులుసును తాగితే శరీరానికి చలువ చేస్తుంది. ఈ మజ్జిగ పులుసులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది.