Side Effects of Kajal: కంటికి కాటుకను రోజూ పెడుతున్నారా? మీరు ఏం తప్పు చేస్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోండి..

మహిళల అందాన్ని(Beauty) మరింత ఇనుమడింపజేయడంలో కాటుక(Kajal) కు ప్రత్యేక స్థానం ఉంది. కంటికి కాటుక పెట్టుకున్న తరువాత ఆ కనులు ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. అయితే, కాటుకను రోజూ పెట్టుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు.

|

Updated on: Feb 24, 2022 | 9:40 AM

చాలా మంది మహిళలు మేకప్ వేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. అందులో భాగంగా.. కంటికి కాటుకను కూడా పెట్టుకుంటారు. కాటుక.. ఆ కళ్లకు మరింత అందాన్నిస్తాయి. కళ్లు పెద్దగా కనిపించేలా, ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి.

1 / 5
ప్రస్తుత కాలంలో అనేక రకాల కాటుకలు(కాజల్) మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిలో అధిక స్థాయిలో రసాయనాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కంటి అలెర్జీలు, కళ్ళు పొడిబారిపోయే ప్రమాదాన్ని సృష్టిస్తుంది.

2 / 5
కాటుక తయారీ కోరసం పాదరసం, లెడ్, పారాబెన్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. ఇది కళ్ళలో కండ్లకలకకు కారణమవుతుంది. కాటుకను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కంటి అలర్జీ, కార్నియల్ అల్సర్‌లు, కళ్లు ఎర్రబడటం వంటివి రావచ్చు.

3 / 5
అంతే కాదు, కాటుక వినియోగం అతిగా ఉంటే.. కళ్లలోపల వాపు వచ్చే ప్రమాదం ఉంది.

4 / 5
అయితే, కాటుకను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చని, అలా ఇంట్లో తయారు చేసిన కాటుకను వినియోగించడం ద్వారా ఎలాంటి హానీ జరుగదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow us