
స్లీవ్‌లెస్, షార్ట్స్ ధరించాలంటే అండర్ ఆర్మ్స్, కాళ్ల నిండా వెంట్రుకలు కనిపిస్తాయని చాలా మంది భయపడతారు. ప్రతిసారి బ్యూటీపార్లర్‌కి వెళ్లి వ్యాక్స్ చేయించుకోవడం కుదరదు. దీంతో ఇంట్లోనే రేజర్‌తో వ్యాక్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

రేజర్‌తో జుట్టును సులభంగా తొలగించవచ్చు. కానీ రేజర్‌తో వెంట్రుకలు తొలగిస్తే, 2-3 రోజుల్లో వెంట్రుకలు మళ్లీ పెరగడం ప్రారంభమవుతాయి. అయితే, అప్పటికప్పుడు వ్యాక్స్ చేయాలనుకునే వారు రేజర్ వాడుకోవచ్చు.రేజర్ ఉపయోగించడం సులభం. అయితే కాస్త నొప్పి కూడా ఉంటుంది. కానీ సమస్య ఏమిటంటే రేజర్ ఉపయోగించడం వల్ల చర్మం గరుకుగా మారుతుంది. కాబట్టి రేజర్ ఉపయోగించిన తర్వాత చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.

రేజర్‌ని ఉపయోగించే పది నిమిషాల ముందు వేడి నీటితో స్నానం చేయాలి. చర్మాన్ని లూఫాతో కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను శుభ్రపరుస్తుంది. రేజర్ ఉపయోగించిన తర్వాత చర్మంపై వేడి నీటిని వాడకూడదు. తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

రేజర్ ఉపయోగిస్తున్నప్పుడు సబ్బును ఉపయోగించవద్దు. షేవింగ్ క్రీమ్ ఉపయోగించవచ్చు. బాడీ వాష్, షవర్ జెల్, కండీషనర్ ఉపయోగించవచ్చు. రోమాలకు వ్యతిరేక దిశలో రేజర్‌ను వాడాలి. మొదట రివర్స్‌లో లాగాలి. ఆపై నేరుగా లాగాలి. తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

షేవింగ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోకూడదు. శరీర నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇది పొడి, కఠినమైన చర్మాన్ని నివారిస్తుంది.