- Telugu News Photo Gallery beauty care tips: how to apply face mask properly facepack ideas skin care
Beauty Care Tips: మార్కెట్‌లో దొరికే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసా
ముఖంగా అందంగా కనిపించాలని మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో ఆ ఫేస్ ప్యాక్ మీ చర్మానికి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఇంట్లో లభించే పండ్లు, కూరగాయలు, పెరుగు, తేనె, కూరగాయలను ఉపయోగించి సహజమైన ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు.
Updated on: Nov 11, 2023 | 12:29 PM

ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు స్కిన్ ఏ టైప్ అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. జిడ్డు చర్మం, పొడి బారిన చర్మం.. సాధారణ చర్మం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని ఏ రకమైన ఫేస్‌ప్యాక్ ని వేసుకోవాలో నిర్ణయం తీసుకోవాలి.

మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తున్నప్పుడు.. చర్మానికి సరిపోతుందో లేదో తనిఖీ చేయడం మర్చిపోవద్దు. ఫేస్ మాస్క్ ఏదైనా సరే.. సరిగ్గా అప్లై చేయాలో తెలుసుకోవాలి.

ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు, మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడానికి తేలికపాటి క్లెన్సర్‌ని ఉపయోగించండి. మృదువైన బ్రష్‌ని ఉపయోగించి ముఖం, మెడ చుట్టూ ఫేస్‌ప్యాక్ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని కళ్ళు, పెదవులపై అప్లై చేయవద్దు.

ఎక్స్‌ఫోలియేటింగ్ ఫేస్ మాస్క్‌ని ఉపయోగిస్తుంటే.. కొన్ని నిమిషాల పాటు వృత్తాకార కదలికలలో వేళ్లతో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి.

ఫేస్ ప్యాక్ ఆరిపోయే వరకు 15-20 నిమిషాలు వేచి ఉండండి. సాధారణంగా ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మంపై చాలా త్వరగా ఆరిపోతుంది. అయితే యాంటీ ఏజింగ్, హైడ్రేటింగ్ మాస్క్‌లను ఎక్కువసేపు ఉంచాలి.

ఫేస్ ప్యాక్‌ను కడగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. సులభంగా శుభ్రపరచడానికి మీరు మృదువైన కాటన్ వస్త్రాన్ని కూడా ఉపయోగించవచ్చు. లేదా స్టోర్లలో లభించే ఫేస్ ప్యాక్ బ్రష్‌తో మీ ముఖాన్ని మసాజ్ చేయడం ద్వారా కూడా శుభ్రం చేసుకోవచ్చు.

ఫేస్ ప్యాక్ కడిగిన అరగంట తర్వాత టోనింగ్, సీరమ్ అప్లై చేయవచ్చు. మాయిశ్చరైజింగ్, సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయాలి.




