బతుకమ్మ పువ్వు.. గునుగు పూల ఉపయోగాలు తెలిస్తే అవాక్కు అవుతారు!

Updated on: Sep 21, 2025 | 2:10 PM

తెలంగాణ ఆడబిడ్డలు ఎంతగానో ఎదురు చూసే బతుకమ్మ పండుగ వచ్చేసింది. సెప్టెంబర్ 21 పెత్తరామాస, ఎంగిలిపూల బతుకమ్మ నుంచి బతుకమ్మ వేడుకలు మొదలై, సెప్టెంబర్ 29 సద్దుల బతుకమ్మ ( పెద్ద బతుకమ్మ)తో ముగుస్తాయి. ఇక పండుగ అంటే తెలంగాణ ప్రజలకు ఎంతో ఇష్టం.

1 / 5
బతుకమ్మ పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది పూలు. ఎందుకంటే బతుకమ్మ కోసం తీరొక్క పూలు తీసుకొచ్చి, అందంగా బతుకమ్మను పేరుస్తుంటారు. అయితే బతుకమ్మ పేర్చే టప్పుడు తప్పనిసరిగా కొన్నిరకాల పూలు మాత్రం ఉంటాయి.

2 / 5
అందులో తంగేడు పువ్వు, గునుగు పువ్వు, సీతమ్మవారి పువ్వు ఈ మూడు లేకుండా చాలా వరకు బతుకమ్మను పేర్చరు. అయితే వీటిలో గునుగు పువ్వు మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఈ పువ్వుతో బతకమ్మను పేర్చడం వలన బతుకమ్మ అందంగా రావడమే కాకుండా, చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది.

3 / 5
అయితే బతుకమ్మ పేర్చే ఈ గునుగు పువ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ఇంతకీ అవి ఏవో తెలుసుకుందాం.తెలంగాణలో ఎక్కువగా కనిపించే ఈ గునుగు పువ్వు తెలియని వారు ఎవరు ఉండరు. ఇది అనేక ఔషధాలు కలిగి ఉన్న గడ్డిజాతి పువ్వు.

4 / 5
అయితే దీని ఆకులను పేస్ట్ చేసి గాయాలు అయిన చోట పూయడం వలన ఎంత పెద్ద గాయం అయినా సరే చాలా త్వరగా మానిపోతుందంట. ముఖ్యంగా కందిరీగలు కుట్టినప్పుడు దీని రసం రాయడం వలన మంట త్వరగా తగ్గిపోవడమే కాకుండా, గాయం కూడా మానుతుందంట. అలాగే క్షయ వ్యాధి నివారణకు కూడా గునుగు ఆకుల రసాన్ని ఉపయోగిస్తారంట.

5 / 5
గునుగు పువ్వుల గింజలు యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయంట. అంతే కాకుండా, రక్త స్రావం, అతిసారం వంటి సమస్యలతో బాధపడే వారు కూడా గునుగు గింజలు తీసుకోవడం చాలా మంచిదంట. కానీ గ్లకోమా ఉన్న వారు మాత్రం గునుగు గింజలకు చాలా దూరం ఉండాలంట.నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.