Relationship Tips: ఇవి తింటే స్టామినా డబుల్.. లైంగిక శక్తిని పెంచే ఆహార పదార్థాలివే..

|

May 11, 2023 | 10:01 PM

లైంగిక ఆరోగ్యం.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, ఆనందాన్ని మెరుగుపరచడమే కాకుండా మిమ్మల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతుంది. మీ లైంగిక శక్తిని, లిబిడోను పెంచడానికి అనేక మందులు, ఆరోగ్య సప్లిమెంట్‌లు ఉన్నప్పటికీ.. వీటిద్వారా ఆరోగ్య సంబంధిత దుష్ప్రభావాలు తలెత్తుతాయి. దీంతో చాలామంది సహజ మార్గంలో స్టామినాను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు.

1 / 6
లైంగిక ఆరోగ్యం.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, ఆనందాన్ని మెరుగుపరచడమే కాకుండా మిమ్మల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతుంది. మీ లైంగిక శక్తిని, లిబిడోను పెంచడానికి అనేక మందులు, ఆరోగ్య సప్లిమెంట్‌లు ఉన్నప్పటికీ.. వీటిద్వారా ఆరోగ్య సంబంధిత దుష్ప్రభావాలు తలెత్తుతాయి. దీంతో చాలామంది సహజ మార్గంలో స్టామినాను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సంతానోత్పత్తి, లైంగిక బలాన్ని పెంచే అనేక ఆయుర్వేద ఆహారాలు ఉన్నాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఆయుర్వేదం సిఫారసు చేసే టాప్ 5 ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

2 / 6
దానిమ్మ.. ఈ పండులో ఎక్కువ పోషకాలు దాగున్నాయి. ఇది క్రమం తప్పకుండా తింటే.. పునరుత్పత్తి ద్రవాల నాణ్యతను పెంచుతుంది. అదనంగా, ఇది గర్భధారణ సంభావ్యతను పెంచుతుంది. రక్త ధమనులను రిలాక్స్ చేసి గుండె, మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరిచే పాలీఫెనాల్స్ దానిమ్మలో అధికంగా ఉండడమే దీనికి కారణం. దానిమ్మ లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. కావున తేలికపాటి నుంచి మితమైన అంగస్తంభన లోపం ఉన్న పురుషులకు.. రుతుక్రమం సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు.. దానిమ్మ పండు మరింత మేలు చేస్తుంది.

3 / 6
ఖర్జూరా పండు.. ఈ సూపర్‌ఫుడ్ పురుషుల సంతానోత్పత్తి, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఇది ఇద్దరిలో లిబిడోను పెంచడానికి కృషి చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం డేట్స్ తినడం వల్ల మీ లైంగిక దారుఢ్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే.. స్పెర్మ్ కౌంట్, నాణ్యతను పెంచే పోషకాలు దీనిలో ఉంటాయి.

4 / 6
బార్లీ గింజలు.. బార్లీలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఇవి పురుషుల్లో, మహిళల్లో అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతాయి. అలాగే, అంగస్తంభన, లైంగిక సమస్యలను దూరం చేసి శక్తిని పెంచడంలో బార్లీ గింజలు చాలా ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు నిపుణులు..

5 / 6
వెల్లుల్లి.. వెల్లుల్లిలో అనేక పోషకాలున్నాయి. శక్తిసామర్థ్యాలను పెంచే పోషకాలు దీనిలో ఉన్నాయి. పలు మానవ, జంతు అధ్యయనాలు వెల్లుల్లి సంతానోత్పత్తిని పెంచుతుందని, రక్త ప్రసరణను పెంచడం ద్వారా లైంగిక పనితీరును మెరుగుపరుస్తుందని తేలింది. దీనిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం పలు సమస్యలను నయం చేస్తుంది.

6 / 6
వాల్నట్స్.. డ్రైఫ్రూట్స్.. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పిస్తాపప్పులు, వాల్‌నట్‌లు, బాదం, జీడిపప్పు, వేరుశెనగ వంటి గింజలను తినడం ద్వారా మహిళలు కోరికలను పెంచుకోవచ్చు. అవి అమైనో ఆమ్లం L-అర్జినైన్‌ను కలిగి ఉంటాయి. ఇది నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను, జననేంద్రియ అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుందని నిరూపితమైంది. తద్వారా శృంగారం కోసం శరీరం సహజ కోరిక పెరుగుతుందని పేర్కొంటున్నారు.