
మనకు ఆరోగ్యనికి మేలు చేసే ఎన్నో పండ్లలో జామ పండు ఒకటి. జామ పండు వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు.. క్యాన్సర్ కణాలు తగ్గిస్తుంది. జామలో ఉండే విటమిన్లు, పోషకలతో శరీరాన్ని మరింత ఉత్తేజ పరుస్తాయి.

జామ పండు వల్లనే కాదు జామ ఆకుల వల్లకూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. జామ ఆకుల వల్ల అమ్మాయిలకు ఎంతో ఉపయోగం ఉందని సూచిస్తున్నారు. పర్యావరణ కాలుష్యం వల్ల ముఖంపై వచ్చే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయని అంటున్నారు.

పర్యావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ముఖంపై గీతలు, నల్ల మచ్చలు ఏర్పడుతున్నాయి. వీటిని దూరం చేయడంలో జామ చెట్టు ఆకులు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. జామ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఇందుకోసం జామ ఆకుల్ని కొన్ని మిక్సీ పట్టుకొని రసం తీసి.. దానికి రెండు చెంచాల ఆవుపాలు కలిపి ఫేస్‌కి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల సెబం ఉత్పత్తినే కాకుండా మొటిమలను, వాటి వల్ల వచ్చే వాపుని తగ్గిస్తుంది. దీనితోపాటు గంటల తరబడి సిస్టమ్స్ ముందు కూర్చుని పనిచేసే వారిలో రిఫ్లెక్షన్ ఎఫెక్ట్ వల్ల ఫేస్‌పై ఫిగ్మెంటేషన్ ఏర్పడుతుంది.

దీని ద్వారా ఫేస్ నల్లగా మారుతుంది. ఆ నలుపు తగ్గాలంటే కొన్ని జామ ఆకుల్ని నీటిలో మరిగించి ఆ నీటితో ఫేస్‌ని కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుందని కొందరి మాట. కొందరు ఆయుర్వేద నిపుణులు చెప్పిన దానిని బట్టి ఈ సమాచారం అందజేస్తున్నాము.