
చాలా మందికి తీసుకునే ఆహారంలో కొన్ని సార్లు వెంట్రుకలు కనిపించడం అనేది జరుగుతుంది. అయితే దీనిని కొందరు లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం అపరిశుభ్రత అని భోజం రెడీ చేసిన వారిపై మండి పడుతుంటారు. అయితే దీనిపై జ్యోతిష్య శాస్త్ర ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు పండితులు. కాగా , దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అయితే మనం రెస్టారెంట్ లేద ఇంటిలో భోజనం చేస్తున్న సమయంలోనైనా సరే తినే ఆహారంలో వెంట్రుక కనిపించడం అనేది శనికి సంకేతం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. శని ప్రభావం వల్లనే ఇలా తీసుకునే ఆహారంలో పదే పదే వెంట్రుకలు కనిపించడం జరుగుతుందంట.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చాలా మందిపై శని ప్రభావం ఉంటుంది. అయితే శని శుభ స్థానంలో ఉంటే అదృష్టం కలిసిరావడం , అలాగే ఏలినాటి శని ప్రభావం ఉంటే పనుల్లో ఆలస్యం, సమస్యలు ఎదురు అవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని సార్లు శని గ్రహం కూడా కొన్ని సంకేతాలను ఇస్తుందంట.

మీరు ఏదైనా తప్ప పని చేస్తున్నప్పుడు లేదా, అనవసర విషయాలపై దృష్టి పెట్టినప్పుడు, అలాగే మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు, అంతే కాకుండా మనం తీసుకునే ఏదో నిర్ణయమో మనల్ని కష్టాల్లో పడేస్తుందనే సమయంలో శని తన సంకేతం ఇస్తాడంట.

మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్న సమయంలో లేదా, మీరు కష్టాలను ఆహ్వానిస్తున్నారు, సమస్యలు ఎదురు అవ్వబోతున్నాయి అనే క్రమంలో మీకు తినే ఆహారంలో వెంట్రుక కనిపించడం జరుగుతుందంట. పదే పదే మీరు తీసుకునే ఆహారం ప్లేట్‌లో వెంట్రుక కనిపిస్తే ఆలస్యం చేయకుండా, మీరు చేస్తున్న పనుల గురించి ఒకసారి ఆలోచించాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.