- Telugu News Photo Gallery Are your children getting rashes due to diapers? Clear the problem with these tips.
డైపర్ వల్ల మీ పిల్లలకు ర్యాషెస్ వస్తున్నాయా.? ఈ టిప్స్‌తో సమస్య క్లియర్..
పిల్లల చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. కొద్ది పాటి వాతావరణ మార్పులు అయినా.. పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే బయటకు వెళ్లినప్పుడు.. రాత్రి సమయంలో.. పిల్లలకు డైపర్స్ వేస్తూ ఉంటారు. ఈ డైపర్స్ కారణంగా కొందరి పిల్లలో ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ డైపర్స్ అందరికీ పడవు. కొందరిలో ర్యాషెస్, దద్దర్లు వంటివి వస్తాయి. దీంతో కంగారు పడి వెంటనే..
Updated on: Dec 09, 2025 | 12:51 PM

పిల్లల చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకు పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి. కొద్ది పాటి వాతావరణ మార్పులు అయినా.. పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే బయటకు వెళ్లినప్పుడు.. రాత్రి సమయంలో.. పిల్లలకు డైపర్స్ వేస్తూ ఉంటారు.

ఈ డైపర్స్ కారణంగా కొందరి పిల్లలో ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ డైపర్స్ అందరికీ పడవు. కొందరిలో ర్యాషెస్, దద్దర్లు వంటివి వస్తాయి. దీంతో కంగారు పడి వెంటనే ఆస్పత్రులకు తీసుకెళ్తారు. కానీ ఈ టిప్స్‌తో డైపర్ ర్యాషెస్ తగ్గించవచ్చు.

డైపర్ ర్యాషెస్, దద్దుర్లను తగ్గించడంలో తల్లిపాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. తల్లి పాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. తల్లి పాలను దద్దుర్లు, ర్యాషెస్ ఉన్న చోట రాయడం వల్ల ఈ ర్యాషెస్ తగ్గుతాయి.

కొబ్బరి నూనెతో కూడా డైపర్ ర్యాషెస్, దద్దుర్లను తగ్గించవచ్చు. కొబ్బరి నూనెలో కూడా మంచి పోషకాలు ఉంటాయి. డైపర్ వేసే ముందే కొబ్బరి నూనె రాసి వేయడం వల్ల మంట, దురద, అసౌకర్యం తగ్గుతాయి.

వాజెలీన్‌తో సహాయంతో కూడా డైపర్ వేయడం వల్ల వచ్చే దద్దుర్లు, మంట, దురద, ర్యాషెస్‌ను తగ్గించుకోవచ్చు. వాజెలీన్ చర్మాన్ని మెత్తబరచి.. సమస్య తగ్గేలా చేస్తుంది. ఇవన్నీ పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని అంటున్నారు నిపుణులు.




