
వర్షాకాలంలో నేల, చెట్లపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌లు గాలిలోకి వ్యాపిస్తాయి. ఈ వైరస్‌లు, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి జలుబుకు కారణం కావచ్చు. ఇది మాత్రమే కాదు ఈ బ్యాక్టీరియా వల్ల మరికొన్ని సమస్యలు వచ్చే ఆకాశం ఉంది.

అయితే, ఈ వైరస్‌లు వర్షం వల్ల మాత్రమే వ్యాపించవు. వేడినీటితో స్నానం చేసి అలవాటు పడిన వ్యక్తులకు, కొద్దిగా చల్లని వర్షపు నీరు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, శరీరంలోని శ్లేష్మాన్ని అధికంగా ఉత్పత్తి చేయడానికి దారితీయవచ్చు. ఈ శ్లేష్మం బ్యాక్టీరియా, వైరస్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి, జలుబుకు దారితీయవచ్చు.

అయితే, రోజూ చల్లని నీటితో తలస్నానం చేసే వ్యక్తులకు ఈ సమస్య ఉండదు. శరీరాన్ని చల్లని వాతావరణానికి అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం చల్లని నీటితో తలస్నానం చేయడం, ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేయడం, ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

బత్తాయి రసం, కూరగాయల రసాలు, జామకాయలు వంటివి ఇమ్యూనిటీని పెంచుతాయి. జలుబు వచ్చినప్పుడు, రెండు రోజుల పాటు ఉపవాసం ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

ముఖ్యంగా చిన్నపిల్లలకు జలుబు వచ్చినప్పుడు వేడినీటితో ఆవిరి పట్టడం, తేనె కలిపిన వేడినీరు ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల వర్షకాలంలో పిల్లలు జబ్బు పడటం తగ్గుతుంది.