
పిల్లలను చిన్నతనం నుంచి జాగ్రత్తగా చూసుకుంటే.. వారు పెద్దయ్యాక ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు పుట్టేటప్పుడు జుట్టు అనేది తక్కువగా ఉంటుంది. దీంతో తల్లులు చాలా హైరానా పడిపోతూ ఉంటారు.

పిల్లల జుట్టును కాపాడాలంటే.. చిన్నతనం నుంచే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి తలకు రాసే ఆయిల్స్, షాంపూలు సరైనవి ఎంచుకోవాలి. పిల్లల జుట్టు బాగా రావాలంటే.. చిన్నప్పటి నుంచి ఈ ఆయిల్స్ రాస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

సన్ ఫ్లవర్ ఆయిల్‌ను మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఆయిల్‌ని పిల్లల జుట్టుకు కూడా వాడవచ్చు. ఇది రాయడం వల్ల వారి స్కాల్ఫ్ తేమగా ఉంటుంది. అలాగే ఆముదం కూడా చాలా మంచిది.

జోజోబో ఆయిల్‌లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. దీన్ని చర్మానికి, జుట్టుకు కూడా రాయవచ్చు. ఈ ఆయిల్ రాయడం వల్ల వచ్చే మార్పు మీకే తెలుస్తుంది. అదే విధంగా బాదం ఆయిల్ కూడా చర్మానికి, జుట్టుకు రాయవచ్చు. ఈ ఆయిల్‌తో పిల్లల చర్మాన్ని, తలను మర్దనా చేస్తే.. హైడ్రేట్‌గా ఉంటారు.

కొబ్బరి నూనె కూడా చాలా పిల్లల జుట్టుకు చాలా మంచిది. ఇది పిల్లల సున్నితమైన చర్మానికి, తలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ కూడా చాలా మంచివి.