ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన

Edited By:

Updated on: Jan 24, 2026 | 9:43 PM

తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జంతు ప్రేమికులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1 / 5
తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జంతు ప్రేమికులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.

2 / 5
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెయ్యికి పైగా కుక్కలు, వందకు పైగా కోతుల దారుణ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో  కుక్కలు,కోతులను  చంపడం సరికాదన్నారు.

3 / 5
 మూగ జీవాలకు ఎక్కడో దూరంగా షెల్టర్స్ ఏర్పాటు చేస్తున్నారన్నారన్నారు.ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు మూగజీవాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నారు.  ఇది పాలనా వైఫల్యం, మానవత్వం క్షీణతకు నిదర్శనమని విమర్శించారు.

4 / 5
హత్యలు కాదు శాస్త్రీయ, మానవీయ పరిష్కారాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, నివాస రక్షణే సరైన మార్గమని స్పష్టం చేశారు. పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు మూగజీవులపై హింస కొనసాగిస్తున్నారన్నారు.

5 / 5
జంతు సంక్షేమ చట్టాలకు విరుద్ధంగా సామూహిక హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి చర్యలు సమాజాన్ని నైతికంగా వెనక్కి నెట్టేస్తాయన్నారు. వెంటనే జంతు హత్యలు నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.