Teachers Day: టీచరమ్మ సమాధికి నివాళి అర్పించి గురుపూజోత్సవం జరుపుకున్న శిష్యులు

| Edited By: Srilakshmi C

Sep 05, 2023 | 8:58 PM

అన్నమయ్య జిల్లా, సెప్టెంబర్‌ 5: అన్నమయ్య జిల్లాలో శిష్యులు గురుపూజోత్సవం రోజున టీచరమ్మ సమాధికి నివాళులర్పించారు. అయ్యోరమ్మ సమాధి వద్ద నివాళి అర్పించి పూజలు చేసి గురుపూజోత్సవం నిర్వహించారు. కృపాబాయి సమాధి వద్ద ప్రార్థనలు చేసారు శిష్యులు. టీచర్ సమాధికి పూజలు చేసి గురుభక్తిని చాటుకున్నారు. గురువులను సన్మానించడం ..

1 / 5
అన్నమయ్య జిల్లా, సెప్టెంబర్‌ 5:  అన్నమయ్య జిల్లాలో శిష్యులు గురుపూజోత్సవం రోజున టీచరమ్మ సమాధికి నివాళులర్పించారు. అయ్యోరమ్మ సమాధి వద్ద నివాళి అర్పించి పూజలు చేసి గురుపూజోత్సవం నిర్వహించారు.

2 / 5
కృపాబాయి సమాధి వద్ద ప్రార్థనలు చేసారు శిష్యులు.  టీచర్ సమాధికి పూజలు చేసి గురుభక్తిని చాటుకున్నారు. గురువులను సన్మానించడం సత్కరించడం, వారి సేవలను కొనియాడడం గురుపూజోత్సవం నాడు మామూలుగా  చేసే కార్యక్రమాలు. అయితే ఇందుకు భిన్నంగా వాల్మీకిపురంలో  కొందరు శిష్యులు గురుపూజోత్సవాన్ని వినూత్న తరహాలో నిర్వహించి గురుభక్తిని చాటుకున్నారు.

3 / 5
వాల్మీకిపురంకు చెందిన ఉపాధ్యాయురాలు కృపాబాయి క్రిస్టోఫర్ దశాబ్దాల క్రితం చనిపోయినప్పటికీ ఆమె వద్ద చదువుకున్న శిష్యులు గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయురాలి సమాధిని శుభ్రం చేసి పూలతో అలంకరించి పూజలు చేసి గురుపూజోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

4 / 5
రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు జి.ఎస్. బషీర్ అహ్మద్ , మస్తాన్ సాహెబ్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రభు చరణ్ , చాంద్ బాషా, మహేష్ కలిసి గురువు సమాధికి పూజలు చేసి, నివాళులర్పించి గురుభక్తిని చాటుకున్నారు. విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయురాలు కృపాబాయి క్రిస్టోఫర్ సేవలను గుర్తుచేసుకున్నారు.

5 / 5
రెండు, మూడు తరాల వారికి చదువు చెప్పిన ఘనత గురువు కృపా బాయికి దక్కిందని, ఉపాధ్యాయులకు ఆమె ఆదర్శమని నివాళులర్పించారు. ఉపాధ్యాయురాలి ఆత్మశాంతి కోసం సర్వమత ప్రార్థనలు చేశారు.