- Telugu News Photo Gallery Amla Benefits: superfood Amla is like Nectar for health know its 5 big benefits
Amla Benefits: ఆరోగ్యాల సిరి ‘ఉసిరి’.. ఆమ్లా తినడం వల్ల కలిగే ఆ అద్భుత ప్రయోజనాలేంటో తెలుసా..?
Health Benefits of Amla: ఉసిరికాయను ఆయుర్వేదంలో అమృతం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది అన్ని సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించే లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. ఇది అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉసిరికాయల ఐదు ముఖ్య ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
Updated on: Dec 16, 2021 | 9:52 PM


హృద్రోగులకు కూడా ఉసిరి వినియోగం చాలా మేలు చేస్తుంది. ఇది గుండె కండరాలను బలపరుస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. రక్తనాళాలలో అడ్డంకిని తొలగిస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఉసిరిలో క్రోమియం అనే మూలకం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఉసిరికాయ మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. మీరు ఉసిరిని నేరుగా తినలేకపోతే.. దాని పొడి, క్యాప్సూల్, జామ్, జ్యూస్ లేదా మురబ్బా లాంటివి తయారు చేసుకోని తినవచ్చు.

మీ నోటిలో తరచుగా పొక్కులు వస్తుంటే.. ఖచ్చితంగా ఉసిరి తినాలి. ఉసిరి రసం మీ కడుపు సమస్యలను దూరం చేయడంతో పాటు వేడిని తగ్గిస్తుంది. ఇది అల్సర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉసిరి రసాన్ని వేడి నీళ్లలో కలుపుకుని తాగితే పొక్కుల సమస్య నయమవుతుంది. మౌత్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ళు బలంగా మారతాయి, నోటి దుర్వాసన తొలగిపోతుంది.




