
కొత్తిమీర తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేడి కారణంగా తలనొప్పితో బాధపడేవారు దీని వల్ల ప్రయోజనం పొందుతారు. వేసవిలో కొత్తిమీర జ్యూస్ ప్రతిరోజూ తీసుకోవాలి. ఇది హీట్ స్ట్రోక్‌ను నివారిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. ఈ సీజన్‌లో టీ, కాఫీకి ఇది మంచి ప్రత్యామ్నాయం.

కొత్తి మీర జ్యూస్ పొడి చర్మానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. తరచూ చర్మం పొడిబారిపోయే సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం కొత్తిమీర జ్యూస్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.. కడుపు నొప్పి, ఆమ్లత్వం, ఉబ్బరం లేదా గ్యాస్ ఉన్నవారు కొత్తిమీర తినాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

మీ రోజువారీ ఆహారంలో కొత్తిమీరను కొత్తిమీర ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది మధుమేహం ఉన్నవారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒక అధ్యయనంలో ఊబకాయం, అధిక రక్త చక్కెర ఉన్న ఎలుకలపై కొత్తిమీరతో ప్రయోగం చేయగా, ఆరు గంటల్లోనే వాటి రక్తంలో చక్కెర 4 mmol/L తగ్గింది.

ఈ రోజుల్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారు. అయితే, పచ్చి కొత్తిమీర శరీరంలో LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. ఇది మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిజానికి, కొత్తిమీర శరీరం నుండి అదనపు సోడియం, నీటిని తొలగిస్తుంది. ఇది రక్తపోటును తక్కువగా ఉంచుతుంది. HDL (మంచి) కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

కొత్తిమీర మెదడుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మెదడు కణాలను బలపరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది నిరాశ, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేయడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోయే రుగ్మత అయిన అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి కొత్తిమీర ఒక శక్తివంతమైన ఔషధం. ఇది మూర్ఛలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.