Chilgoza Seeds: చిల్గోజా నట్స్‌ తెలుసా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..

|

Dec 02, 2024 | 3:01 PM

డ్రై ఫ్రూట్స్.. మన ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో ప్రతి అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది సీజన్‌తో సంబంధం లేకుండా తమ రోజువారి ఆహారంలో డ్రై ఫ్రైట్స్ ను తప్పనిసరిగా తీసుకుంటారు. డ్రైఫ్రూట్స్‌ అనగానే ముఖ్యంగా బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరాలు, వాల్‌నట్స్‌ ఇలాంటి ఎక్కువగా గుర్తుకు వస్తాయి. అయితే, జీడిపప్పు, బాదం పప్పు లాగే చిల్గోజా కూడా ఓ డ్రై ఫ్రూట్. దీనిని పైట్ నట్ అని కూడా అంటారు. ఈ పండు విత్తనాల్ని డ్రై ఫ్రూట్‌గా వాడతారు. తియ్యగా ఉండే ఈ నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

1 / 5
చలికాలంలో చిల్గోజా గింజలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన వెచ్చదనం దొరుకుతుంది. అలాగే ఎముకలు దృఢంగా మారతాయి. చిల్గోజా గింజల్ని ఫేస్ స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. పైన్ గింజల్ని పొడిచేసి సమాన పరిమాణంలో బియ్యం పిండిని కలపాలి. ఇందులో నీళ్లు పోసి పేస్ట్‌లా చేసి స్క్రబ్‌లా అప్లై చేయాలి. దీంతో చర్మం లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది.

2 / 5
చిల్గోజా గింజల్లో కాటెచిన్, లుటిన్, లైకోపీన్, కెరోటినాయిడ్స్, టెకోఫెరాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అనేక అనారోగ్యాల నుంచి కాపాడతాయి.
చిల్గోజా సీడ్స్‌తో పాటు దానిని నూనెను అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. దీన్ని తినడం వల్ల శరీరానికి బలం వస్తుంది. బలహీనత తొలగిపోతుంది.

చిల్గోజా గింజల్లో కాటెచిన్, లుటిన్, లైకోపీన్, కెరోటినాయిడ్స్, టెకోఫెరాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అనేక అనారోగ్యాల నుంచి కాపాడతాయి. చిల్గోజా సీడ్స్‌తో పాటు దానిని నూనెను అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. దీన్ని తినడం వల్ల శరీరానికి బలం వస్తుంది. బలహీనత తొలగిపోతుంది.

3 / 5
చిల్గోజా గింజలు ఒత్తైన జుట్టును అందిస్తాయి. పైన్ నట్స్ తినడం వల్ల లేదా పైన్ నట్ నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. పైన్ గింజల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్యను నివారించవచ్చు. అయితే దీనిని తినే ముందు షుగర్ పేషెంట్లు డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

4 / 5
పైన్ గింజల్లో పినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. జంక్ ఫుడ్, అనవసరమైన ఫుడ్ తినడాన్ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల మీరు బరువు తగ్గుతారు. మీ ఆహారంలో చిల్గోజా గింజల్ని చేర్చడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తద్వారా మతిమరుపు వంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు.

5 / 5
చిల్గోజా గింజలు ఒత్తైన జుట్టును అందిస్తాయి. పైన్ నట్స్ తినడం వల్ల లేదా పైన్ నట్ నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. పైన్ గింజల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్యను నివారించవచ్చు. అయితే డయాబెటిక్‌తో ఇబ్బంది పడుతున్న వారు దీనిని తినే ముందు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవటం ఉత్తమం అంటున్నారు నిపుణులు.