
మన భారతీయుల్లో చాలా మంది ఇంగువను ప్రతిరోజూ ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని గణనీయంగా పెంచే మసాలా. అయితే, స్థూలకాయాన్ని తగ్గించడంలో ఇంగువ నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు దీన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా తీసుకొవచ్చు. ఎందుకంటే.. ఇంగువ యాంటీ బాక్టీరియల్. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లతో పోరాడడంలో సహాయపడుతుంది.

ఇంగువ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలు దరిచేరవు. కఫాన్ని తొలగించడంతో పాటు శ్వాసకోశ వ్యవస్థను కూడా శుభ్రపరుస్తుంది. ఇంగువ నీరు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లు, మొటిమలను తగ్గిస్తాయి. ఇంగువ నీరు చర్మానికి సహజమైన తాజాదనాన్ని అందిస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇంగువ నీళ్లను ముఖానికి కూడా రాసుకోవచ్చు. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం వాపు తగ్గుతుంది.

ఇంగువలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా ఇంగువ నీరు జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. ఇంగువ నీరు తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంగువలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

ఇంగువ నీరు జీర్ణక్రియను గణనీయంగా మెరుగుపరుస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది వేగంగా బరువు తగ్గడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇంగువ నీరు తాగడం వల్ల శరీరం నుండి అనేక విషపదార్థాలు తొలగించబడతాయి.

ఇంగువ నీటిని తయారు చేయడం చాలా సులభం. దీన్ని చేయడానికి ముందుగా ఒక గ్లాసు వేడి నీటిని తీసుకుని, అందులో చిటికెడు ఇంగువ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఇంగువ నీరు తాగేందుకు రెడీగా ఉన్నట్టే. ఈ నీటిని తాగే ముందు ఒకసారి డాక్టర్‌ని సంప్రదించటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.