
వంటలో ఏ నూనె వాడతారు అనే దానిపై మీ పూర్తి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో వివిధ రకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం నుంచి బరువు పెరగడం వరకు ఎన్నో దుష్ర్పభావాలు చూపుతాయి. కాబట్టి వంటనూనెను ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న నూనెలను కూడా చాలా మంది వినయోగించరు. అలాగే బాదం నూనె మీ రోజువారీ వంటలలో వినియోగించవచ్చు.

విటమిన్ ఇ, మెగ్నీషియం, భాస్వరం, రాగి వంటి మినరల్స్ చర్మ ఉపరితలాన్ని పునరుద్ధరిస్తాయి. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. పొడి చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి.

బాదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ E సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా వృద్ధాప్య సంకేతాలను దరిచేరనీయదు. అలాగే కాలుష్యం, సూర్యకాంతి, హానికర కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ నూనె మచ్చలు, గాయాల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది.

బాదం నూనెలో సూర్య కిరణాల వల్ల డ్యామేజ్ అయిన చర్మాన్ని రక్షిస్తుంది. అందుకే సన్‌స్క్రీన్‌లో కూడా ఈ నూనె ఉంటుంది. చర్మంపై చికాకు ఉన్నట్లయితే, బాదం నూనెను అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫ్యాటీ యాసిడ్‌లు, విటమిన్లు ఎ, ఇ కందిన చర్మానికి ఉపశమనం అందిస్తుంది.

ఆర్గానిక్, కోల్డ్ ప్రెస్డ్ ఫార్ములేషన్‌లో బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు. రాత్రిపూట కొన్ని చుక్కల బాదం నూనె పూసుకుని నిద్రించడం వల్ల చర్మం బాగా హైడ్రేట్ గా ఉంటుంది.