
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు : నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, ఒక కప్పు బీరకాయ ముక్కలు, ఒక కప్పు దోసకాయ ముక్కలు, 15 వెల్లుల్లి రెబ్బలు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, మూడు కప్పుల కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెను తీసుకోవాలి.

ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి తయారీ విధానం: ముందుగా మీరు తీసుకున్న కూరగాయల ముక్కలను ఒక పాత్రలో తీసుకుని వాటిని బాగా కడిగి, మళ్ళీ ఇంకో సారి వాటిని బాగా తుడిచి ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టాలి. ఇలా చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముక్కలు తడిగా ఉంటే పచ్చడి త్వరగా చెడిపోతోంది.

కూరగాయ ముక్కలకు ఉప్పును ఇలా పట్టించాలి: ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నాలుగు కప్పుల మామిడి ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు , దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తరవాత దానిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటిని బాగా కనీసం 5 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.

కొద్దీసేపటి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడి, మూడు కప్పుల కారం, ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడిని కూడా దీనిలో వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని బాగా వేయించాలి. మీరు కూరగాయల ముక్కలను కలుపుకునేటప్పుడు ముక్కలకు అన్ని సరైన కొలతలతో పట్టించాలి.

ఇక చివర్లో నువ్వుల నూనెను పోసి దానిలో మీరు ఉప్పు కారం పట్టించిన ముక్కలను తీసుకుని దీనిలో ముంచేలా కలపాలి. ఆ తరవాత ఈ మిశ్రమాన్ని ఒక జాడీ లేదా పెద్ద గాజు సీసాలో మూడు రోజుల పాటు ఉంచితే మంచి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని కుమ్మేయండి.