- Telugu News Photo Gallery Agarwood Tree: The World's Most Expensive Tree and Its Cultivation Profits
Most Expensive Tree: ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన చెట్టు.. ఒక్కటి పెంచితే లైఫ్ సెట్టు..
Most expensive tree in the world: డబ్బు పెట్టే కొనే చెట్లు అంటే మనకు ముందుగా గుర్తేది గందపు చెట్లు. ఈ చెట్టు కలపను సుగంద్ర ద్రవ్యాల తయారీలో వాడుతారు కాబట్టి దీని భాగా డింమాండ్ ఉంటుంది. ధర కూడా బాగానే పలుకుంతుందని మనకు తెలుసు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్టు గురించి మీరెప్పుడైనా విన్నారా? దీని ఒక కిలో ధర వింటే మీకు ఖచ్చితంగా తల తిరుగుతుంది. ఇంతకు ఆ చెట్టు ఏమిటి అనుకుంటున్నారా అయితే తెలుసుకుందాం పదండి.
Updated on: Oct 18, 2025 | 8:49 PM

ప్రపంచవ్యాప్తంగా వేల రకాల చెట్లు ఉన్నాయి, కానీ వాటిలో, అగర్వుడ్ అనే చెట్టు అత్యంత అరుదైన, ఖరీదైన చెట్లలో ఒకటిగా పిలువబడుతుంది. ఈ చెట్టు కిలోగ్రాముకు రూ. 2 లక్షల నుండి రూ. 73 లక్షల వరకు అమ్ముడవుతోంది. ఇది బంగారం కంటే ఖరీదైనదని చెబుతారు. అగర్వుడ్‌ను చెట్ల దేవుడు అని కూడా పిలుస్తారు.

అగర్వుడ్ అనేది ప్రధానంగా ఈశాన్య భారతదేశంలో కనిపించే చెట్టు. ఈ చెట్టు సాగు విస్తృతంగా ఉంది, ముఖ్యంగా త్రిపుర రాజధాని అగర్తలాలో. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో కూడా దీనిని సాగు చేస్తున్నారు. నర్సీల నుంచి మనం ఈ మొక్కను కొనుగోలు చేయవచ్చు. ఇవి ఆర్థికంగా చాలా లాభదాయకమైన మొక్క కాబట్టి, ప్రభుత్వం, పరిశోధనా సంస్థలు ఈ చెట్టును ఎలా సాగు చేయాలో రైతులకు శిక్షణ ఇస్తున్నాయి.

అగర్వుడ్ చెట్టులోని అత్యంత విలువైన భాగం దాని రెసిన్. చెట్టుకు ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఈ చెట్టులో రెసిన్ ఉత్పత్తి అవుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం, చెట్టుకు దాదాపు 8 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, దానికి ఒక ఇన్ఫెక్షన్ లేదా పరాన్నజీవి ఏర్పడుతుంది. దీని ఫలితంగా చెట్టు లోపల నల్లటి, ఘనమైన రెసిన్ ఏర్పడుతుంది. ఈ రెసిన్ ఎంతో సువాసనను వెదజల్లుతుంది. ఇది ఈ చెట్టు ధరను అసాధారణ స్థాయికి పెంచుతుంది

అగర్వుడ్ ధర దాని నాణ్యత, రెసిన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మంచి నాణ్యత గల అగర్వుడ్ రెసిన్ మార్కెట్లో రూ. 73 లక్షల వరకు ధర పలుకుతుంది. రైతులు ఈ చెట్టు నుండి లక్షల రూపాయలు సంపాదిస్తారు. రైతు జీవితాన్ని మార్చడానికి ఒకే చెట్టు సరిపోతుందని చెబుతారు. చెట్టు నుండి రెసిన్ బయటకు వచ్చే సమయంలో వ్యాపారులు ముందుగానే మొక్కలను బుక్ చేసుకుంటారు.

అగర్వుడ్ చెట్టు సుగంధ ద్రవ్యాలు, ధూపం, ఫర్నిచర్ తయారీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని రెసిన్ సువాసనలను తయారు చేయడానికి ఉపయోస్తారు. అగర్వుడ్ నుండి తయారైన పరిమళ ద్రవ్యాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమండ్ ఉంది. అదనంగా, దీని కలపను విలువైన ఫర్నిచర్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఈ కారణాలన్నింటికీ, అగర్వుడ్ చెట్టు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చెట్లలో మొదటి స్థానంలో ఉంది.
