- Telugu News Photo Gallery Adding These 4 Ingredients To Warm Water May Help Heal Non Alcoholic Fatty Liver
Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? వేడి నీళ్లలో వీటిని కలిపి తాగారంటే కొవ్వు వెన్నలా కరిగిపోవాల్సిందే..
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్ తినడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ విధమైన అనారోగ్య జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫ్యాటీ కాలేయం చాలా సాధారణ వ్యాధిగా మారిపోయింది. ఫ్యాటీ లివర్ తొలిదశలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మధుమేహం, గుండె జబ్బులు, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తొలిదశలోనే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే కాలేయ వ్యాధిని నివారించవచ్చు..
Updated on: Jan 15, 2024 | 7:27 PM

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్ తినడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ విధమైన అనారోగ్య జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఫ్యాటీ కాలేయం చాలా సాధారణ వ్యాధిగా మారిపోయింది. ఫ్యాటీ లివర్ తొలిదశలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మధుమేహం, గుండె జబ్బులు, లివర్ సిర్రోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. తొలిదశలోనే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే కాలేయ వ్యాధిని నివారించవచ్చు.

మందులతో పాటు, ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం కాలేయానికి చాలా ముఖ్యం. కొవ్వు పదార్ధాలు తినడం పూర్తిగా మానేయాలి. అలాగే ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించేందుకు ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. కొవ్వు కాలేయాన్ని సహజంగా చికిత్స చేయడంలో వేడి నీరు చాలా ఉపయోగపడుతుంది. ఇది కాలేయంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ వేడి నీటిలో అదనంగా 4 పదార్థాలను జోడించడం వల్లమరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కాలేయంపై కొవ్వు నిల్వలను తగ్గించడానికి, కాలేయం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది కాలేయ పనితీరును కూడా పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వేడి నీళ్లలో చిటికెడు పసుపు కలిపి తాగవచ్చు. పసుపులోని కర్కుమిన్ సమ్మేళనం శరీరంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా, పసుపు సహజమైన మార్గంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధికి చికిత్స చేయడంలో సహాయపడుతుందని, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

వేడి నీటిలో అల్లం కలిపి తాగితే.. అల్లంలోని శోథ నిరోధక లక్షణాలు మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కాలేయ కొవ్వును కరిగించడంలో అల్లం చాలా ప్రభావవంతంగా ఉంటుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. వేడి నీరు లేకుండా వేడి గ్రీన్ టీ తాగవచ్చు. గ్రీన్ టీలోని కాటెచిన్స్ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ టీ కాలేయంలో కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.




